తమన్నా హీరోయిన్ గా తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆమె తెలుగు సినిమాలు చేస్తున్న దగ్గరనుంచి చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళ్ళింది. అంతేకాదు పాత్రల విషయంలో ఆమె ఏనాడూ ఫలానా పాత్ర చేయాలని అనుకోలేదు. అన్ని రకాల పాత్రలలో నటించింది. ఐటమ్ సాంగ్ లలో కూడా ఆమె స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ విధంగా ఆమె  కెరీర్ ఇప్పుడు చివరి దశలో ఉందని చెప్పవచ్చు.

ఎందుకంటే కొత్త హీరోయిన్ లు బాగా రావడంతో ఆమె అందరి హీరోలతో నటించి ఉండటంతో ఆమెకు పెద్ద హీరోల సరసన అవకాశాలు పెద్దగా రావడం లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆమె కొన్ని ఐటమ్ సాంగ్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక సత్యదేవ్ హీరోగా నటిస్తున్న శీతాకాలం గుర్తుందా సినిమాలో కూడా హీరోయిన్ నటిస్తోంది. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి అని చెప్పవచ్చు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ప్రేమికుల రోజున విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. కన్నడ సినిమా లవ్ మాక్ టైల్ సినిమాకు ఇది రీమేక్.

కాగా తమన్నా చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకుడు కాగా ఈ చిత్రం తప్పకుండా మరిన్ని అవకాశాలను తనకు తీసుకువస్తుంది అని భావిస్తోంది తమన్నా. ఇక గని సినిమాలో ఆమె ఐటం సాంగు లో నర్తించిన విషయం తెలిసిందే. ఈ విధంగా తమన్నా అటు వెబ్ సీరీస్ లు ఇటు సినిమాలు మరొకవైపు ఐటం సాంగులు అంటూ తన కెరీర్ ను గతంలో కంటే బిజీగా ఉంచుకుంటుంది. మరి ఆమె తోటి హీరోయిన్లు ఇప్పటికే సినిమాల నుంచి ఫేడవుట్ అయిపోయిన నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా ఎన్ని రోజులు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: