ఈ రోజుల్లో సినిమాలు విడుదల అవ్వడం చాలా కష్టం.. మంచి డేట్ దొరకడం చాలా కష్టం అవుతుంది.అంతే కాదు ఒక మంచి రోజు దొరికిందంటే చాలు ఆ రోజు ఏకంగా మూడు, నాలుగు సినిమాలు లైన్ లో ఉంటాయి.. ఇక కరోనా కేసులు కూడా పూర్తిగా తగ్గాయని తెలుస్తుంది. ఈ మేరకు సినిమా ల విడుదల కూడా జోరందుకుంది.ఏపీలో టికెట్ రేట్స్ ఇష్యూ కూడా ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తుంది.. అందుకే వరుస సినిమాలు విడుదలకు సిద్దాంగ ఉన్నాయి. ఒకేసారి చాలా సినిమాలు మూకుముడిగా బాక్సాఫిస్ పై దాడి చేస్తున్నారు.


ఈ నెల 25 న సినిమాల సందడి మాములుగా లేదుగా.. వరుసగా ఆ రోజున నాలుగు సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యంలో టాలివుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. నాలుగు సినిమాల పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. చిన్న సినిమాలు అయినా కూడా ఆసక్తికరమైన కాన్సెప్టులతో వచ్చేస్తున్నాయి. అజిత్ కుమార్ వాలిమై కూడా ఉంది. ఈయనే ఫిబ్రవరి చివర్లో అందరికంటే ముందు వస్తున్నాడు. ఫిబ్రవరి 24న ఈయన నటించిన వాలిమై విడుదల కానుంది.. కార్థికెయ విలన్ పాత్రలో నటించారు. 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.


ఫిబ్రవరి 25న పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా వస్తుందని మొన్నటి వరకు అనుకున్నారు కానీ ఇప్పుడు అది రావడం లేదని అర్థమైపోతుంది. ఎప్రిల్ 1నే ఈ సినిమాను విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తున్నారు.శర్వానంద్, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్ లాంటి కుర్ర హీరోలంతా ఒకేరోజు బాక్సాఫీస్ దగ్గర పోటీకి సిద్ధమవుతున్నారు..అవి కూడా అందరికి అంచనాలను పెంచుతున్నాయి.వరుణ్ తేజ్ గని కూడా వచ్చేస్తుంది. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో వస్తుంది. ఈ సినిమా కూడా అదే రోజూ రిలీజ్ కూడా రెడీ గా వుంది. మొత్తానికి ఆరోజు వస్తున్న సినిమాలు అన్నీ కూడా ఓ మాదిరిగా బాక్సాఫిస్ ను షేక్ చేయనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: