సినిమా పరిశ్రమలో ప్రేక్షకులను అయినా సినిమా వారినైనా ఆకట్టుకోవాలంటే ఒకే ఒక మంత్రం గ్లామర్ షో. హీరోయిన్ లకు ఇది వరం లాంటిదని చెప్పవచ్చు. ఏ సినిమా పరిశ్రమలోనయన హీరోయిన్ గా రాణించాలన్నా హీరోయిన్ గా ఎదగాలన్న తప్పకుండా గ్లామర్ షో ప్రదర్శించాల్సిందే. అలా ఈ సూత్రాన్ని పాటించిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు టాప్ పోజిషన్ లో ఉండి పెద్ద సినిమాలను చేస్తున్నారు. అంతే కాదు దీపం ఉన్నప్పుడు ఇల్లు సరిదిద్దుకోవాలి వారు ఈ వయసులో ఉన్నప్పుడే గ్లామర్ షో చేసి మంచి సినిమా అవకాశాలను అందుకొని సెటిల్ అయిపోయారు.

ఆ విధంగా ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు సోషల్ మీడియా వేదికగా తమ అందాలను ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. అలా ఓ హీరోయిన్ హద్దులులేని గ్లామర్ ను తన సోషల్ మీడియాలో ప్రదర్శిస్తూ అందరినీ ఎంతగానో ఆకర్షిస్తుంది. మాస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ మాలవిక మోహనన్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ హల్చల్ అంతా ఇంతా కాదు.

గతంలో ఎవరూ చేయని విధంగా భవిష్యత్తులో ఎవరు చేయలేని విధంగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో భారీ స్థాయిలో అందాలతో హల్చల్ చేస్తుంది. ప్రతిరోజూ తన ఫొటోస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అందరి దృష్టిలో పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు తెలుగులో ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ సినిమాలో ఆమె నటించబోతుందట. అంతేకాదు ఆమె మరికొన్ని తెలుగు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేయబోతుందట. త్వరలోనే వాటి అనౌన్స్మెంట్లు రానున్నాయి.  ఈ చిత్రం తప్పకుండా ఆమెకు భారీ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఆమె ప్రస్తుతం తమిళం లో మంచి సినిమాలే చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: