టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య డెబ్యూ మూవీ జోష్ అయితే అంతగా సక్సెస్ కాలేదు. జోష్ సినిమా బాగున్నా కాని అతనికి మొదటి హిట్ ను అందించిన సినిమా మాత్రం 'ఏమాయ చేసావె'. తమిళ స్టార్ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని 'ఇందిరా ప్రొడక్షన్స్' సంస్థ పై మహేష్ సోదరి ఘట్టమనేని మంజుల నిర్మించడం అనేది జరిగింది.ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలు అప్పట్లో యూత్ ప్లే లిస్ట్ లో బాగా మారు మొగిపోయేవి. ఇక ఇప్పటికీ కూడా ఈ పాటలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తూనే ఉన్నాయి. ఆ పాటలో వుండే విజువల్స్ అయితే ఒక మంచి ఫీలింగ్ ని ఇస్తాయి. అసలు ఎటువంటి అంచనాలు అనేవే లేకుండా 2010 వ సంవత్సరం ఫిబ్రవరి 26న విడుదలైన ఈ సినిమా విడుదల అయ్యి యువతను ఎంతగానో ఆకట్టుకుంది.ఇప్పటికి కూడా ఈ సినిమాకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోయారు.మంచి క్లాసికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా చూసి అప్పట్లో చాలా మంది యువతకు కూడా లవ్ ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యేవి.


ఇప్పుడు పెద్ద స్టార్ హీరోయిన్ అయిన సమంత ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వడం.. మొదటి సినిమాతోనే మంచి స్టార్ ఇమేజ్ ను సంపాదించుకోవడం జరిగింది. ఇక ఇవ్వాల్టితో ఈ చిత్రం విడుదలై 12 ఏళ్ళు పూర్తికావడం… అలాగే సమంత టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి కూడా 12ఏళ్ళు పూర్తికావడం అనేది జరిగింది.ఇక 'ఏమాయ చేసావె' సినిమాకి రూ.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అనేది జరిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.11.79 కోట్ల షేర్ ను నమోదు చేసింది. అంటే బయ్యర్లకి మొత్తం రూ.2.79 కోట్ల లాభాలను అందించింది. ఈ సినిమాకి రూ.10 కోట్ల బడ్జెట్ లోనే ఫినిష్ చేయడం జరిగింది. థియేట్రికల్ రైట్స్ రూపంలోనే ఈ సినిమాకి చాలా వరకు రికవరీ అనేది అయిపోయింది. శాటిలైట్ రైట్స్ ఇంకా అలాగే మ్యూజిక్ రైట్స్ వంటి వాటితో నిర్మాత మరింత లాభపడినట్టు ట్రేడ్ పండితుల నుంచి సమాచారం అనేది అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: