టాలీవుడ్ మ్యాచో మెన్ గోపీచంద్ సరైన హిట్ అందుకొని చాలా కాలం అయింది అని చెప్పాలి. లౌక్యం తర్వాత ఆయనకు అంతటి స్థాయి విజయం దక్కలేదు. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఎంతో స్టైలిష్ ఎంతో గొప్పగా ఉంటుంది కానీ బ్లాక్ బస్టర్ స్థాయి హిట్ మాత్రం అందుకోలేక పోతున్నాడు. ఆ విధంగా జిల్ గౌతమ్ నంద పంతం సిటిమార్ ఆరడుగుల బుల్లెట్ వంటి చిత్రాలు ఆయనకు  భారీ ఫలితం అయితే తీసుకు రాలేదు.

ఆ విధంగా ఇతర హీరోలతో పోలిస్తే గోపీచంద్ కొంత వెనకబడే ఉన్నారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పై ఆయన భారీ ఆశలే పెట్టుకున్నారు అని చెప్పాలి. మారుతి ట్రాక్ రికార్డు పరంగా ఈ సినిమా చేస్తే తప్పకుండా గోపీచంద్ హిట్ జోష్ లో ఉన్నట్లే. మారుతి గోపిచంద్ ను సరికొత్తగా ఈ సినిమాలో చూపించబోతున్న వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు.

ఇక తనకు లక్ష్యం లౌక్యం వంటి హిట్ సినిమాలను అందించిన శ్రీవాస్ తోనే తన తదుపరి సినిమా చేయనున్నాడు గోపీచంద్. హైదరాబాద్లో ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా వెరైటీగా ఉండబోతుంది అని అంటున్నారు. హీరోయిన్ గా కిలాడీ భామ డింపుల్ హాయతి నటిస్తుండగా ప్రముఖ నటి ఖుష్బూ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గత సినిమాల తరహాలోనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. శ్రీవాస్ మార్క్ హాస్యం తప్పనిసరి ఈ చిత్రంలో కనిపించే పోతుందట. మరి ప్రమాదపు అంచుల్లో ఉన్న గోపీచంద్ కెరీర్ ఈ సినిమాతో సేఫ్ జోన్ కి వస్తుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: