హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం..ET (ఎవరికీ తలవంచడు). ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై డైరెక్టర్ పాండిరాజ్ తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించి మార్చి 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలో సైతం విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటించినది. ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో సత్యరాజ్ నటించారు. తెలుగు లో ఈ చిత్రాన్ని ఏషియన్ సంస్థ ద్వారా విడుదల అయినా కూడా ఈ చిత్రం మొదటి రోజే ఫ్లాప్ టాక్ తో ముందుకు నడిచింది.. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రం యావరేజ్ గానే కొనసాగుతోంది. ప్రస్తుతం ఇప్పుడు రెండో వీకెండ్ కూడా నడుస్తూ ఉంది. అయితే మాస్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక కలెక్షన్లను కూడా అలాగే కొల్లగొట్టింది. ఇక ఈ చిత్రం కలెక్షన్ల విషయానికి వస్తే..


1). నైజాం- రూ.95 లక్షలు.
2). సీడెడ్-రూ. 50  లక్షలు.
3). ఉత్తరాంధ్ర- రూ.47 లక్షలు.
4). ఈస్ట్- రూ.29 లక్షలు.
5). వెస్ట్- రూ. 20 లక్షలు.
6). గుంటూరు- రూ. 25 లక్షలు
7). కృష్ణ- రూ. 23 లక్షలు.
8). నెల్లూరు- రూ. 15 లక్షలు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.3.4 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ET చిత్రం తెలుగు రాష్ట్రాలలో రూ.3.62 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరగగా.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 3.8 కోట్ల రూపాయల వరకు రాబట్టాల్సి ఉంటుంది.. కానీ ఈ చిత్రం పదకొండు రోజులు పూర్తి అయ్యేసరికి కేవలం..3.4 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది.

దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే ఇంకా రూ. 76 లక్షలకు పైగా రాబట్టాలి.. ఇక ఈ సినిమాతో పాటుగా రాధే శ్యామ్ సినిమా కూడా విడుదల అయినప్పటికీ ఈ చిత్రం థియేటర్ లో బాగానే నిలదొక్కుకుంది అని చెప్పవచ్చు. కానీ బ్రేక్ ఈవెన్ ఛాన్సులు మాత్రం ఎక్కువగా కనిపించలేదు. కేవలం ఈ చిత్రం యావరేజ్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: