తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడిగా పేరు పొందాడు ప్రకాష్ రాజ్. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. కన్నడ హీరో రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పునీత్ రాజ్ కుమార్ సేవలను ఇకపై తన సొంత ఫౌండేషన్ ద్వారా అనే వాటిని ముందుకు తీసుకు వెళ్తానని తెలియజేశారు. ఈరోజు తన పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని అందరితో పంచుకుంటున్నానని తెలిపారు. అంతే కాకుండా ఈ విషయం పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

పునీత్ రాజ్ ప్రారంభించిన సేవలను.. ఇక మీదట ప్రకాష్ రాజు ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకు వెళుతున్నాను అని.. అందుకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఫోటోలు షేర్ చేస్తూ ప్రకాష్ రాజ్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక ప్రకాష్ రాజ్ చేసిన ఈ పోస్టులో అప్పు ఎక్స్ప్రెస్ అని రాసి ఉన్నది. దీంతో పునీత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటుగా ఆయన కు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ తన చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ప్రకాష్ రాజ్ చేతిలో ప్రస్తుతం మేజర్, kgf-2, శాకుంతలం తో పాటు మరికొన్ని సినిమాలలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రకాష్ రాజ్ కి కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం, కన్నడ ఇండస్ట్రీ చిత్రాల్లో కూడా మంచి నటుడిగా గుర్తింపు ఉంది. అలాగే తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కూడా పాల్గొన్నారు. షాద్ నగర్ లో తన వ్యవసాయ క్షేత్రంలో కొన్ని మొక్కలను కూడా నాటడం జరిగింది. ప్రకాష్ రాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విజయవంతంగా కొనసాగుతూనే ఉంది.. ప్రతి ఒక్కరు కూడా తన జీవితంలో గుర్తుండిపోయేలా తమ పుట్టిన రోజులలో.  వివాహ రోజులలో కొన్ని మొక్కలు నాటడం వల్ల పర్యావరణానికి చాలా మేలు అని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: