కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విష్ణు విశాల్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా `గట్టా కుస్తీ`. చెల్లా అయ్యవు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని తెలుగులో `మట్టి కుస్తీ` అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. విష్ణు విశాల్ స్టూడియోస్ ఆర్ టీ టీమ్ వర్క్స్ బ్యానర్ పై రవితేజ విష్ణు విశాల్ తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసిన మేకర్స్ ఇదే సందర్భంగా ఈ సినిమా తమిళ తెలుగు టైటిల్ ని కూడా ప్రకటించేశారు. ఇదొక బై లింగ్వల్ సినిమా. తెలుగు మోషన్ పోస్టర్ ని హీరో మాస్ మహారాజా రవితేజ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.స్పోర్ట్స్ ప్రధానంగా సాగే సినిమాలంటే ఎప్పుడూ ఇష్టపడతానని ఎంటర్ టైన్ మెంట్ తో సాగే స్పోర్ట్స్ డ్రామాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నందుకు ఆనందంగా వుందని ఇదుగో `మట్టి కుస్తీ` మోషన్ పోస్టర్` అంటూ మాస్ మహారాజా రవితేజ కామెంట్ చేశారు. ఈ సినిమాలో స్రవంతి సాయినాథ్ హీరోయిన్ గా నటిస్తోంది.



విష్ణు విశాల్ కుస్తీ పట్టే మల్లయోధుడి (రెజ్లర్) రోల్ లో కనిపించబోతున్నారు. టైటిల్ మోషన్ పోస్టర్ మంగళ వాయిద్యాలతో స్టార్ట్ అయ్యింది. ఇక మధ్యలో పెళ్లి పత్రిక.. బ్రహ్మముడి ఆ తరువాత కుస్తీ గ్రౌండ్ ని చూపింపించారు. పెళ్లికి ఇంకా కుస్తీకి వున్న సంబంధం ఏంటన్నది మోషన్ పోస్టర్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లీ చేసుకోవడం కోసం హీరో కుస్తీ రింగ్ లోకి దిగాడా? అన్నది ఆసక్తికరంగా వుండబోతుంది.ఇక స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు రవితేజ కూడా యాడ్ అవ్వడంతో ఈ సినిమాపై మంచి క్రేజ్ క్రియేట్ అవుతోంది. అంతే కాకుండా ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ అతిథి పాత్రలో మెరిసే ఛాన్స్ వుందని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: