
ఇప్పటికే ఈ మూవీ స్టోరీ విషయమై రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పక్కాగా కసరత్తు చేస్తున్నారని, అలానే ఈ మూవీ సౌత్ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే భారీ అడ్వెంచరస్ డ్రామాగా ఉండేటువంటి అవకాశం ఉందని ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఆ విధంగా ప్రారంభానికి ముందే ఈ భారీ ప్రాజక్ట్ విపరీతమైన హైప్ ని సొంతం చేసుకుంది. అయితే విషయం ఏమిటంటే ఈ సినిమాకి సంబంధించి వారం రోజుల క్రితం మరొక ఇంటర్వ్యూ లో భాగంగా విజయేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి. మహేష్ తో సినిమా చేస్తున్నారు కదా, అసలు రాజమౌళి ఆ సినిమాని ఎటువంటి స్థాయిలో తీయాలని, ఎంత బడ్జెట్ కేటాయించాలని అనుకుంటున్నారు అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన విజయేంద్ర ప్రసాద్, నిజానికి రాజమౌళి ఎప్పుడూ కూడా హీరోల కోసం కథలు సిద్ధం చేయమనరు, తాను అనుకున్న పాయింట్ కి నేను ఏదైనా కథ చెపితే, అది ఒకవేళ తనకి నచ్చితే, దానికి సరిపోయే నటీనటుల్ని ఎంచుకుంటారు.
అయితే ప్రస్తుతం మాత్రం సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేయబోతున్నాడు, ముందుగా కథ సెట్ అవ్వనివ్వండి, అప్పుడు చూద్దాం అంటూ సమాధానం ఇచ్చారు విజయేంద్ర ప్రసాద్. దానితో అసలు నెక్స్ట్ రాజమౌళి మహేష్ బాబు తోనే తదుపరి సినిమా చేస్తారా లేదా అనే అనుమానాన్ని పలువురు వ్యక్తబరిచారు. ఇక రెండు రోజల క్రితం నుండి ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో భాగంగా తన తదుపరి సినిమా పక్కాగా మహేష్ తోనే అంటూ రాజమౌళి తేల్చిచెప్పడం జరిగింద. దానితో అన్ని అనుమానాలు కూడా తొలగిపోయాయి. ఇక ఈ భారీ ప్రాజక్ట్ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.