టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హ్యాండ్సమ్ హీరో గా ఉన్నాడు రామ్ పోతినేని. దేవదాసు సినిమాతో హీరోగా పరిచయమైన ఈ హీరో అప్పటినుంచి వరుస మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సూపర్ హిట్ అందుకొని మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చిన ఈ హీరో మంచి దర్శకులతో భారీ బడ్జెట్ మరియు పాన్ ఇండియా సినిమా లను లైన్ లో పెడుతున్నాడు. ఆ విధంగా ఈ హీరో తొందర్లోనే దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకోబోతున్నాడు అని చెప్పవచ్చు. 

ఇదిలా ఉంటే టాలీవుడ్ లో ఎప్పుడు లేనంతగా పెద్ద హీరోలకు స్టార్ హీరోలకు హీరోయిన్ల సమస్య ఎదురవుతుంది. ఇప్పటి దాకా సీనియర్ హీరోలకు మాత్రమే ఈ విధమైన సమస్య ఎదురయ్యేది కానీ ఇప్పుడు స్టార్ హీరోలకు కూడా ఈ విధమైన సమస్య ఎదురు కావడంతో అందరిని ఇది ఎంతగానో ఆశ్చర్య పరిచిన విషయం అవుతుంది. తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా ను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక ను ఎంపిక చేసిన రామ్ రెండవ హీరోయిన్ కోసం చాలా మందిని పరిశీలిస్తున్నారట.

ఎవరు కూడా ఆ పాత్రకు తన పర్సనాలిటి కి తగ్గట్లుగా లేకపోవడంతో ఈ హీరోయిన్ పాత్ర కు ఎవరిని తీసుకోవాలా అని వెయిట్ చేస్తున్నారట. రామ్ లాంటి హీరో పక్కన నటించే హీరోయిన్ దొరకకపోవడం నిజంగా తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ల కొరత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఉదాహరణ. అంతేకాదు లింగుస్వామి దర్శకత్వంలో ఆయన చేస్తున్న ది వారియర్ సినిమా విషయంలో కూడా హీరోయిన్ ల విషయంలో కొంత సర్దుబాటు చేసుకోక తప్పలేదు. మెయిన్ హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తున్న కూడా హీరోయిన్ విషయంలో చాలా తలమునకలై చివరికి ఓ హీరోయిన్ ను ఎంపిక చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: