విడాకుల తరువాత సమంత వరుస సినిమాలు చేసే విధంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు ఇంకా కొన్ని స్టార్ హీరోల సినిమాలలో నటించేందుకు అంగీకరించింది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అలాగే హాలీవుడ్ లో కూడా ఈమె మంచి సినిమా అవకాశాల ను అందుకుంటుంది. అలా తన క్రేజ్ ను తిరిగి తెచ్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ప్రేమ కథా సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇంకొకవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంది. ఆమె గుణశేఖర్ దర్శకత్వం లో చేసిన శాకుంతలం సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది అని చాలా రోజులు వార్తలు అవుతున్నా కూడా ఇప్పటికీ ఈ సినిమా విడుదల కాకపోవడం సమంత అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తుంది. పౌరాణిక సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ఇకపోతే సమంత తమిళనాట నటించిన కె ఆర్ కె సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమంతతో పాటు నయనతార మరో హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుప తి హీరోగా నటించాడు. త్రికోణ ప్రేమకథ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందని అందరూ అనుకోగా అనూహ్యంగా ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. అందరికీ చెడ్డ పేరు తీసుకు వచ్చింది. ఈ నేపథ్యంలో సమంత ఈ తరహా సినిమాలు చేయడం మానేస్తే బాగుంటుంది అని ఆమె అభిమానులు సలహాలు ఇస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు ఈ విధమైన సూచనలు చేస్తున్నారు. మరి ఈమె వారి సలహాలను సూచనలను పాటిస్తుందా అనేది చూడాలి. సినిమా మాత్రం తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించ లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: