గత కొద్ది రోజుల నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా భాష గురించి పలు వివాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయాన్ని మరొకసారి తట్టిలేపింది నటి సుహాసిని. హిందీ భాష పేరు చెబితే మండిపడే తమిళనాడు వాసులకు హిందీ కి మద్దతుగా తెలియజేసింది సుహాసిని. దీంతో భాషల వివాదం మరొకసారి భగ్గుమంటోంది. ఇప్పటికే ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య సినీ నటుల మధ్య వార్ జరుగుతూనే ఉంది. ఇలా సరికొత్తగా పలు వివాదాలు తలెత్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, కన్నడ నటుడు సుదీప్ మధ్య హిందీ వివాదం తలెత్తడం జరిగింది.

హిందీ జాతీయ భాష కాదని సుదీప్ కామెంట్ చేయగా మీ సినిమా హిందీ లో ఎందుకు చేస్తున్నారని అజయ్ దేవగన్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి సమయంలో మరొకసారి భాషల మధ్య దుమారాన్ని రేపి ట్రోలర్స్ చేతులలో వైరల్ అవుతోంది నటి సుహాసిని. చెన్నైలో జరిగిన ఒక షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా హాజరైన సుహాసిని అలాంటి సమయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

హిందీ భాషలో మాట్లాడే వాళ్లు చాలా మంచి వాళ్ళని వాళ్లతో మాట్లాడాలి అంటే మనం కూడా హిందీ బాగా నేర్చుకోవాలి అని ఆమె కామెంట్ చేసింది. ఈ కామెంట్ పై పలువురు నెటిజన్స్ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. హిందీ మంచి లాంగ్వేజ్ హిందీ మాట్లాడే వాళ్ళు మంచి వాళ్ళు.. అయితే మనం కూడా ఆ భాష నేర్చుకోవాలి.. అంటే తమిళం వాళ్ళు కూడా మంచి వాళ్లే కదా హిందీ వాళ్ళు కూడా తమిళంలో మాట్లాడితే సంతోషంగా ఉంటుందని  కదా అని పలువురు నెటిజన్స్  తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అయితే సుహాసిని మాట్లాడిన ఈ మాటలపై తమిళనాడు జనం చాలా మండిపడుతున్నారు. హిందీ మీద అంత ప్రేమ ఉంటే ముంబైకి వెళ్లి బాలీవుడ్ సినిమాలలో నటించాలని ఆమె పైన సెటైర్లు వేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ దుమారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: