యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ తీసిన లేటెస్ట్ మూవీ కెజిఎఫ్ చాప్టర్ 2. హోంబలె ఫిలిమ్స్ వారు ఎంతో భారీ వ్యయంతో నిర్మించిన ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమాలో ప్రకాష్ రాజ్, రావు రమేష్ కీలక పాత్రలు చేయగా విలన్ గా అధీర పాత్రలో కనిపించారు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. అలానే రమిక సేన్ పాత్రని బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ పోషించగా మరొక ముఖ్య పాత్రలో ఈశ్వరి రావు కనిపించారు.

మూడున్నరేళ్ల క్రితం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయి అన్ని భాషల్లో కూడా పెద్ద సక్సెస్ కొట్టిన కెజిఎఫ్ చాప్టర్ 1 సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన కెజిఎఫ్ చాప్టర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మరింత భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషల్లో కూడా ప్రస్తుతం భారీ స్థాయి కలెక్షన్స్ తో దూసుకెళ్తుండడం విశేషంగా చెప్పుకోవాలి. యాష్ అత్యద్భుత నటన, ప్రశాంత్ నీల్ అత్యద్భుత దర్శకత్వ ప్రతిభ, భారీ నిర్మాణ విలువలు, సాంగ్స్, డైలాగ్స్ వంటివి కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీని ఎంతో భారీ సక్సెస్ చేసాయి అంటున్నారు విశ్లేషకులు.

ఇక కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ ఇటీవల అఫీషియల్ గా ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల మార్క్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది. అయితే అసలు విషయం ఏమిటంటే, నిన్నటితో బాలీవుడ్ కి అత్యధిక కలెక్షన్ అందుకున్న సినిమాల్లో రెండవ స్థానంలో నిలిచిన కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ ప్రస్తుతం అక్కడ ఇంకా మంచి కలెక్షన్ ని రాబడుతున్నట్లు చెప్తున్నారు అనలిస్టులు. సెలవు రోజుల్లో బాగా కలెక్షన్ అందుకుంటున్న ఈ సినిమా, మాములు రోజుల్లో సైతం బాగానే రాబడుతోందని, ముఖ్యంగా యువత, మాస్ ప్రేక్షకులు ఈ సినిమాని బాగా ఆదరిస్తున్నారని వారు అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఓవరాల్ గా ఈ సినిమా ఎంత మేర కలెక్షన్ కొల్లగొడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: