నిన్నటి రోజున మదర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు తమ తల్లికి ఏదైనా బహుమతులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటోంది. ఇక సెలబ్రిటీలు సైతం తమ కు తోచిన విధంగా వాటిని ఇస్తూ సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వారిలో తెలుగు హీరోయిన్ తన తల్లికి ఒక కాస్ట్లీ కారు కొనిచ్చి మదర్స్ డే సందర్భంగా గిఫ్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు ఆమె ఎలాంటి బహుమతి ఇచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఇక కొంత మంది సెలబ్రిటీలు సైతం తమ మాతృమూర్తులకు సేవలను గుర్తు ఉంచుకునేందుకు తన తల్లితో కలిసి దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. అలా ఉండడమే కాకుండా వారికి మదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉంటారు. ఇక హీరోయిన్ రాశి ఖన్నా మాత్రం తన తల్లికి ఒక ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చింది సినిమా షూటింగ్ల తో బిజీగా ఉన్నప్పటికీ ఆదివారం మాత్రం ఖచ్చితంగా తన తల్లి దగ్గరికి వెళుతుందట ఈ ముద్దుగుమ్మ. మదర్స్ డే సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలపడమే కాకుండా ఆమెతోనే ఆరోజు గడిపిందట.

అనంతరం ఒక ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. దీని ధర దాదాపుగా రూ. 1.40 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కార్ల షోరూం లో bmw కారును కొనుగోలు చేసేటప్పుడు వారు దిగిన ఫోటోలు ఇప్పుడు పెట్టిన వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇందులో రాశి ఖన్నా తండ్రిని కూడా మనం గమనించవచ్చు. ఇక సినిమాల విషయానికొస్తే జులై 1వ తేదీన పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక నాగ చైతన్యతో థాంక్యూ అనే చిత్రంలో కూడా నటించింది. ఇక పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా ఈమె నటిస్తున్నది. తమిళంలో కూడా నాలుగైదు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: