యాష్ హీరో శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గావ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా ఎంతటి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుందో మన అందరికీ తెలిసిందే. కే జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ పై ప్రేక్షకులు  భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇలా భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ సంపాదించడం మాత్రమే కాకుండా అదిరిపోయే కలెక్షన్లను కూడా బాక్సాఫీస్ దగ్గర  అందుకుంది. 

మూవీ  ప్రస్తుతం కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబడుతూ విజయవంతంగా దూసుకుపోతోంది.  ఒక వైపు కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతుండగా,  మరో వైపు ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో వీడియో సాంగ్ ని ఒక దాని తర్వాత ఒక దానిని విడుదల చేస్తూ వస్తున్నారు.  అందులో భాగంగా కే జి ఎఫ్ చాప్టర్ 2 చిత్ర బృందం మొదట ఈ సినిమా లోని మెహబూబా అనే సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఆ తర్వాత కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ నుండి తుఫాన్ వీడియో సాంగ్ ని విడుదల చేశారు.

ఈ సాంగ్ కి కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.  ప్రస్తుతం యూట్యూబ్లో ఈ రెండు సాంగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.  ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి మరో వీడియో సాంగ్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.  తాజాగా ఈ చిత్ర బృందం సుల్తానా అనే సాంగ్ ను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో ద్వారా ఒక పోస్టర్ విడుదల చేసి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది.  మరి ఈ వీడియో సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: