బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు నేపథ్యంలో ఈడీ అధికారులు విచారణ ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సురేష్ చంద్ర తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా నే జాకీ కేసులో కీలకంగా మారింది. ఇప్పటికే పలు సార్లు ఈడీ ముందర విచారణకు హాజరు అయింది. అధికారులు జాకీ నుంచి కూడా కీలక సమాచారాన్ని రాబట్టడం జరిగింది. సుకేష్ కు జాక్వెలిన్ కు ఉన్న రిలేషన్ గురించి కూడా పూర్తి సమాచారాన్ని అందించింది.

సురేష్ నుంచి అందుకున్న బహుమతులు నగదు లెక్కగట్టి దాదాపుగా రూ.7  కోట్ల రూపాయలు ఉండడంతో జాక్వలిన్ ఆస్తులను సైతం  ఈడి అధికారులు జప్తు  చేయడం జరిగింది. విచారణ నేపథ్యంలో దేశం దాటి వెళ్లడానికి వీలు లేదని కోర్టు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంలోనే సల్మాన్ ఖాన్ దుబాయ్ లో నిర్వహించిన ఒక ఈవెంట్ కి హాజరు కావాల్సి ఉండగా.. వచ్చిన సందర్భంలో ప్రత్యేకమైన కోర్టు నుండి  అనుమతులు తీసుకుని మరి దుబాయ్ ఫ్లైట్ ఎక్కింది. ఇక గతంలో ముంబై ఎయిర్ పోర్టులో ఈమె పై చోటుచేసుకున్న హంగామా ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈమె ఎలాంటి అనుమతులు లేకుండా ఫ్లైట్ ఎక్కాలని ట్రై చేసింది కానీ ఎయిర్పోర్ట్ పోలీసులు అడ్డుకోవడంతో అప్పటికప్పుడు హుటాహుటిగా అనుమతులు తెచ్చుకొని మరి ఫ్లైట్ ఎక్కింది.


తాజాగా ఇప్పుడు మరొకసారి ఇదే పరిస్థితి ఏర్పడింది. మే 31 నుండి జూన్-6 వ తేదీ వరకు జరిగే ఐఫా అవార్డులు వేడుకలకు హాజరు కావలసి ఉన్నది. దీంతో ఈమె దుబాయ్ తో పాటు నేపాల్ ఫ్రాన్స్ వెళ్లి వచ్చేందుకు కూడా 15 రోజులు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ కోర్టు ని కోరడం జరిగింది. అయితే ఢిల్లీ కోర్టు మాత్రం కేవలం దుబాయ్ కి వెళ్ళడానికి మాత్రమే అనుమతించింది. నేపాల్ ఫ్రాన్స్ వంటి ఇతర దేశానికి వెళ్ళడానికి వీలు లేదని నిరాకరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: