నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు నందమూరి నటసింహం బాలకృష్ణ ఎన్నో హిట్, సూపర్ హిట్ , బ్లాక్ బస్టర్ సినిమా లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.

అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న సినిమా కెరియర్ పరంగా బాలకృష్ణ కు 107 వ సినిమా. దానితో ఈ సినిమాను ఎన్ బి కే 107 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణను జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలను అందుకుంటూ కామెడీ దర్శకుడిగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ 50 ఏళ్ళ వయస్సు గల వ్యక్తిగా కనిపించబోతున్నట్లు, ఈ సినిమాలో బాలకృష్ణ కు ఒక కూతురు ఉండబోతునట్లు,  ఆ కూతురు పాత్రలో శ్రీ లీల కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ తో అనిల్ రావిపూడి తెరకెక్కించబోయే సినిమాను తన స్టైల్ లో కామెడీ యాంగిల్ లో కాకుండా,  బాలకృష్ణ స్టైల్ మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నట్లు అనిల్ రావిపూడి స్పష్టం చేశాడు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ , అనిల్ రావిపూడి సినిమా తర్వాత చేయబోయే సినిమాకు కూడా డైరెక్టర్ ను కన్ఫామ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి సినిమా తర్వాత బాలకృష్ణ బీవీఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బివిఎస్.రవి చెప్పిన కథకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఆహా 'ఓ టి టి' లో చేసిన ఆన్ స్థాపబుల్ టాక్ షో ను డిజైన్ చేసింది బీవీఎస్ రవినే. ఆ పరిచయంతోనే బాలకృష్ణ ఈ ఛాన్స్ ను బీవీఎస్ రవి కి ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: