ఇక బిగ్ బాస్ అంటే సెలబ్రిటీ షో అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు పాపులర్ సెలబ్రిటీలు మాత్రమే ఈ షోకి కంటెస్టెంట్ గా తీసుకువచ్చేవారు. కానీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 నుంచి రూట్ మొత్తం మార్చేశారు. కొంతమంది సెలబ్రిటీలతో పాటు ఇంకా అలాగే మరి కొంతమంది సెలబ్రిటీ హోదా లేని వాళ్ళని కూడా తీసుకువస్తున్నారు.సోషల్ మీడియా సెలబ్రిటీలు టీవీ సెలబ్రిటీలు ఇంకా అలాగే వెండితెర సెలబ్రిటీలను సింగర్ లను ఇలా ప్రతి ఒక్కరిని కంటెస్టెంట్ గా హౌస్ లోకి తీసుకుని వస్తున్నారు. ఇకపోతే త్వరలోనే ప్రసారం కానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కి సంబంధించి కంటెస్టెంట్స్ ఎంపిక కూడా ముగిసింది అని తెలుస్తోంది. అయితే ఇప్పటికే పలువురు కంటెస్టెంట్ ల పేర్లు  కూడా పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. మరి ఆ కంటెస్టెంట్ లు ఎవరూ? ఏమిటి? అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. న్యూలి మేరీడ్ సినిమా ఫేమ్ సంజన చౌదరి, హీరోయిన్ ఆశా సైనీ ఇంకా యూట్యూబర్ కుషిత కల్లపు, అలాగే యాంకర్ మంజూష లు బిగ్ బాస్ సీజన్ 6 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.


ఇంకా అలాగే వీరితో పాటుగా సింగర్ మోహన భోగరాజు, జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష, సుమన్ టీవీ యాంకర్ మంజూష, కొరియోగ్రాఫర్ పొప్పీ మాస్టర్, సీరియల్ నటి కరుణ భూషణ్, సుమన్ టీవీ యాంకర్ రోషన్, వలయం మూవీ ఫేమ్ హీరో లక్ష్య చదలవాడ ఇంకా అలాగే తెలుగు బుల్లితెర నటుడు కౌశిక్, బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ సిరి హనుమంతు ప్రియుడు శ్రీహాన్ ఇంకా అలాగే మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్ చైతన్య గరికపాటి లు బిగ్ బాస్ సీజన్ 6 లో సందడి చేయబోతున్నారు అని సమాచారం తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేర్లు లో ప్రేక్షకులకు దాదాపుగా కొంతమంది అసలు పరిచయం లేని వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు. మరి సోషల్ మీడియా లో వినిపిస్తున్న ఈ పేర్లు ఫైనల్ అవుతాయా లేకపోతే ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారో ఇక చూడాలి మరి. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 6ని వీలైనంత తొందరగా ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి బిగ్ బాస్ షో నిర్వాహకులు చాలా బాగానే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: