కోలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరు అయిన సూర్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్న సూర్య తాను నటించిన అనేక మూవీ లను తెలుగు లో కూడా డబ్ చేసి విడుదల చేసి తెలుగు లో కూడా స్టేట్ హీరోలతో సమానంగా క్రేజ్ ని సంపాదించుకున్నాడు .

ఇలా కోలీవుడ్ తో సమాన మైన క్రేజ్ ను టాలీవుడ్ లో సంపాదించుకున్న సూర్య తాజా గా ఈటి మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని కూడా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేశారు.  ఈ మూవీ లో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా , ఈ మూవీ కి పాండిరాజ్ దర్శకత్వం వహించాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది . ఇలా థియేటర్ లలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయిన ఈటి సినిమా మరి కొన్ని రోజుల్లో బుల్లి తెరపై ప్రేక్షకులను అలరించ బోతోంది .

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి ఈటి మూవీ సిద్దం అయ్యింది . ఈటి మూవీ 12 జూన్ 2022 వ తేదీన సాయంత్రం 6 గంటలకు జెమిని టీవీ లో ఈ మూవీ ప్రసారం కానుంది . మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకే ఆకట్టుకుంటుందో చూడాలి . ఈటి మూవీ కి డి. ఇమ్మాన్ సంగీతాన్ని సమకూర్చడం జరిగింది .

మరింత సమాచారం తెలుసుకోండి: