అందాల ముద్దుగుమ్మ సమంత గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది .

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న సమంత తమిళ్ లో కూడా అనేక సినిమా లలో నటించింది. అలాగే హిందీలో కూడా ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో  సమంత నటించింది. ఇది ఇలా ఉంటే సమంత తన కెరీర్ లో ఎన్నో కమర్షియల్ మూవీ లలో నటించి ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. అలా కమర్షియల్ మూవీ ల ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న సమంత ప్రస్తుతం మాత్రం ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమా లపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా సమంత ఇప్పటికే ఓ బేబీ , యూ టర్న్ వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీ లలో నటించింది.  ఈ మూవీ లు మంచి విజయాలను సాధించాయి. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ శాకుంతలం , యశోద వంటి రెండు లేడీ ఓరియెంటెడ్ మూవీ లలో నటించింది. ఈ రెండు మూవీ లు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ఇలా వరుస పెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపుతున్న సమంత మరో లేడీ ఓరియంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మలయాళంలో ఒక్క సినిమాలో కూడా నటించని సమంత లేడీ ఓరియెంటెడ్ మూవీతో మలయాళం ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా సమంత ప్రస్తుతం ఎక్కువ శాతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తూ కెరీర్ ను ముందుకు సాగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: