తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో ఒకరు అయిన రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాసు సినిమాతో వెండితెరకు పరిచయం అయిన రామ్ పోతినేని మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.

ఆ తర్వాత రామ్ పోతినేని ఇటు క్లాస్ అటు మాస్ ఇమేజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ సూపర్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న రామ్ పోతినేని ప్రస్తుతం ది వారియర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహిస్తూ ఉండగా కృతి శెట్టి ఈ మూవీలో రామ్ పోతినేని సరసన కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను తెలుగు , తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.  ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ పోతినేని, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ పోతినేని కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే... తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న రామ్ పోతినేని తన స్కూల్ స్నేహితురాలు అయిన అమ్మాయితో గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నట్లు, ఆ విషయం ఇరు కుటుంబాలకు తెలియగా వారు కూడా వీరి వివాహానికి ఒప్పుకున్నట్లు, త్వరలోనే వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు,  ఆ తర్వాత మరి కొన్ని రోజుల్లో వివాహం జరగనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: