లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ సినిమా జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , హిందీ , మలయాళం భాషల్లో కూడా జూన్ 3 వ తేదీనే విడుదల అయ్యింది.

ఈ సినిమాకు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించగా,  విజయ్ సేతుపతి ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ లో ఓ కీలక పాత్రలో ఫహాద్ ఫాజిల్ నటించగా , సూర్యమూవీ లో గెస్ట్ రోల్ లో నటించాడు. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు.  విడుదలయిన మొదటి షో కే ప్రేక్షకుల నుండి అదిరిపోయే బ్లాక్ బస్టర్ టాక్ ను బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విక్రమ్ సినిమా ఇప్పటి వరకు 31 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది.

అందులో భాగంగా ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసి ఇ బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్ లను వసూలు చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 31 వ రోజు  విక్రమ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 లక్షల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే 31 రోజులకు గాను విక్రమ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.
నైజాం : 7.18 కోట్లు , సీడెడ్ : 2.29 కోట్లు , యూ ఎ : 2.48 కోట్లు , ఈస్ట్ : 1.29 కోట్లు , వెస్ట్ : 84 లక్షలు , గుంటూర్ : 1.18 కోట్లు , కృష్ణ : 1.41 కోట్లు , నెల్లూర్ : 61 లక్షలు.
31 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ మూవీ  17.28 కోట్ల షేర్ ,  30.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: