హరీష్ శంకర్ మాటలు దేనికి సంకేతం !

‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బష్టర్ హిట్ వచ్చిన తరువాత ఒక దర్శకుడు టాప్ రేంజ్ కి వెళ్ళిపోతాడు. అయితే అతడికి మరో భారీ సినిమా ‘దువ్వాడ జగన్నాధం’ తీయడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అయితే ఆతరువాత అతడు వరుణ్ తేజ్ తో ‘గద్దల కొండ గణేష్’ సినిమాను తీసినప్పటికీ అతడి దృష్టి మాత్రం టాప్ హీరోల పైనే ఉంది.


ఎట్టకేలకు హరీష్ శంకర్ కల నిజమై పవన్ కళ్యాణ్ తో ‘భధీయుడు భగత్ సింగ్’ మూవీ ప్రాజెక్ట్ ఫైనల్ చేసుకున్నప్పటికీ ఆమూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో అన్న క్లారిటీ హరీష్ కు లేదు. దీనితో పవన్ కోసం తయారుచేసుకున్న ఈ స్క్రిప్ట్ ను వేరే టాప్ హీరోతో చేయాలని చాల గట్టిగా ప్రయత్నించాడు అని అంటారు. అయితే అక్కడ కూడ అతడికి అదృష్టం కలిసి రాకపోవడంతో ఆ టాప్ హీరో డేట్స్ హరీష్ కు దక్కలేదు అని టాక్.


ఈవిషయానికి అసహనానికి గురై కాబోలు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ దేనికి సంకేతం అంటూ ఇప్పుడు చర్చలు జర్గుతున్నాయి. “What’s yours will find you” అంటూ విధి ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అన్న భావనలో కామెంట్స్ చేసాడు. దీనితో ఒక మంచి కథను తయారుచేసుకుని ఒక టాప్ హీరోను ఆకథకు ఒప్పించినా విధి తనకు సహకరించడం లేదు అన్న భావం హరీష్ కామెంట్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది.


వాస్తవానికి ఈకథను పవన్ భావజాలానికి అనుగుణంగా హరీష్ శంకర్ ఎంతో కష్టపడి వ్రాసాడు అని అంటారు. మహాకవి శ్రీశ్రీ ని విపరీతంగా అభిమానించే హరీష్ శంకర్ లో కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ. ఆ భావాల ప్రభావంతోనే ‘భవధీయుడు భగత్ సింగ్’ మూవీలో పవన్ ప్రొఫెసర్ పాత్రను హరీష్ మలిచాడు అన్న మాటలు ఉన్నాయి. అయితే ఈమూవీకి పవన్ అక్టోబర్ రెండు నుండి చేపట్టబోతున్న బస్సు యాత్ర అడ్డు తగలడంతో ఈమూవీ ఎప్పటికి మొదలవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి..




మరింత సమాచారం తెలుసుకోండి: