లావణ్య త్రిపాటి ప్రధాన పాత్రలో తెరకెక్కిన హ్యాపీ బర్త్ డే సినిమా జూలై 8 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ కి మత్తు వదలరా ఫెమ్ రితీశ్ రానా దర్శకత్వం వహించగా , నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్  ఈ మూవీ లో కీలక పాత్రల్లో నటించారు.

డిఫరెంట్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ల నుండి ట్రైలర్ ల వరకు అన్ని డిఫరెంట్ గా ఉండడంతో ఈ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలే పెట్టుకున్నారు. అలాగే ఈ మూవీ ప్రమోషన్ లను కూడా చిత్ర బృందం చాలా డిఫరెంట్ గా ట్రై చేసింది. ఈ మూవీ యూనిట్ చేసిన డిఫరెంట్ ప్రమోషన్ లకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇలా మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి రోజు మొదటి షో  కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సీడ్ టాక్ ను తెచ్చుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ కి మిక్సీడ్ టాక్ లభించినప్పటికీ ఈ సినిమా పర్వాలేదు అనే రేంజ్ లో కలెక్షన్ లను రాబడుతోంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...  ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ ని నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' సంస్థ ఎప్పటి నుండి స్ట్రీమింగ్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: