సాయి పల్లవి ఈ పెరు కి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా చేస్తోంది అంటే చాలు ఆ సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది అని అభిమానుల సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఈ ముద్దుగుమ్మ యువతలో ఎంత క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా తన వైపు తిప్పుకొని మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఈమె నటన పరంగా డాన్స్ పరంగా తిరుగులేని హీరోయిన్ గా పేరు పొందింది. ఇక ఎంత బలమైన కథ అయినా సరే చివరకు సాయి పల్లవి మోయగలిగి సామర్థ్యం కలదు.

ప్రస్తుతం తెలుగు,తమిళ భాషలలో కూడా ఈమెకు పలు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల సాయి పల్లవి నటించిన విరాటపర్వం చిత్రం కూడా విడుదలైంది ఈ సినిమాతో తన స్థాయి మరింత ఒక మెట్టు పైకి ఎక్కిందని చెప్పవచ్చు.. ఇక ఇప్పుడు తమిళంలో కూడా ఈమె నటిస్తున్న గార్గీ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నది ఈ చిత్రం కూడా లేడి ఓరియెంటెడ్ చిత్రం కావడం గమనార్హం. ఈనెల 15న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు.

సినిమా కథ కూడా కేవలం మొత్తం సాయి పల్లవి చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమా ప్రమోషన్ పనుల్లో సాయి పల్లవి ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నది. తెలుగు తమిళ భాషలలో ఈ సినిమా ప్రమోషన్ చేస్తూ ఉన్నది తమిళంలో ఈ సినిమాను సూర్య జ్యోతిక చూడడం జరిగింది ఈ సినిమా చూసిన వీరిద్దరూ కూడా ఈ సినిమా తమిళంలో ప్రజెంట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇక ఈ సినిమాలో తెలుగులో ప్రజెంట్ చేయడానికి హీరో రానా ఒప్పుకోవడం విశేషమని తెలియజేసింది. ఇక ఈ చిత్రానికి సమర్పకురాలిగా తన పేరు వేస్తానని నిర్మాతలు చెప్పగా.. త్వరలోనే నేను కూడా ఒక సినిమా నిర్మిస్తానని అప్పుడే తన పేరు వేసుకుంటానని తెలియజేసింది సాయి పల్లవి. మరి ఏ చిత్రంతో తన నిర్మాతగా మారబోతుందో తెలుపలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: