ఆది పినిశెట్టి గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఆది పినిశెట్టి ఇప్పటికే అనేక తెలుగు సినిమాలలో నటించి తనకంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక గుర్తింపును దక్కించుకున్నాడు. తేజ దర్శకత్వం లో తెరకెక్కిన ఒక వి చిత్రం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో గా పర్వాలేదు అనే రేంజ్ విజయాలను దక్కించుకున్నప్పటికీ విలన్ గా , సపోర్ట్ యాక్టర్ గా మాత్రం అదిరిపోయే బ్లాక్బస్టర్ విజయాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకున్నాడు .

కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయిన సరైనోడు సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించిన ఆది పినిశెట్టి ఆ పాత్రతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు . అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు . ఆ తరువాత రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం మూవీలో రామ్ చరణ్ కి అన్న పాత్రలో నటించిన ఆది పినిశెట్టి ఈ పాత్రతో కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్నాడు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా, సపోర్ట్ యాక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న ఆది పినిశెట్టి తాజాగా రామ్ పోతినేని హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన ది వారియర్ మూవీ లో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.

ఈ సినిమాలో కూడా రామ్ తో సమానంగా ఆది పినిశెట్టి కూడా సన్నివేశాలు పడ్డాయి. అలాగే ఆది పినిశెట్టి కూడా తన అద్భుతమైన నటన తో అదరగొట్టాడు. అలా ది వారియర్ మూవీతో మరోసారి ఆది పినిశెట్టి తన అద్భుతమైన విలనిజంతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: