ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోలు తమ రూటు మార్చారు. అందులో భాగంగా వారు ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో కొత్త కొత్త లుక్ లలో కనిపిస్తూ తన అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా అలరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం మన టాలీవుడ్ సీనియర్ హీరోలలో కొంతమంది నెరిసిన జుట్టు ఉన్న లుక్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ టీజర్ లో బాలకృష్ణ నెరిసిన జుట్టు తో అదిరిపోయే లుక్ లో కనిపించాడు. ఈ లుక్ పై బాలకృష్ణ అభిమానులు మాత్రమే కాకుండా ఎంతో మంది ప్రేక్షకులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి నెరిసిన జుట్టుతో అదిరిపోయే లుక్ లో ఉన్నాడు. ఈ మూవీ లోని మెగాస్టార్ చిరంజీవి లుక్ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేక్షకులు కూడా ప్రశంసలు కురిపించారు. 

విక్టరీ వెంకటేష్ ఇప్పటికే తన అన్న కొడుకు అయినా దగ్గుబాటి రానా తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఒక పోస్టర్ ను మేకర్స్ విడుదల చేయగా, అందులో వెంకటేష్ నెరిసిన జుట్టుతో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. ఈ లుక్ పై వెంకటేష్ అభిమానులతో పాటు సామాన్య సినీ ప్రేమికులు కూడా  ప్రశంసలు కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: