అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయ్యాడు. ఇక అది సంచలన విజయం సాధించడంతో ఒక్కసారిగా విజయ్ రౌడీ స్టార్‌గా అసాధారణమైన పాపులారిటీని సాధించాడు.అంతేకాదు, విజయ్ పెద్ద స్టార్ హీరో అయ్యాడు. దాంతో ఇక గీత గోవిందం సినిమా చేసే అవకాశం అందుకున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్‌తో చేసిన రొమాన్స్ పెట్టుకున్న లిప్ కిస్సులు మిగతా సినిమాలలో కూడా అభిమానులు ఆశించడం మొదలుపెట్టారు. ఇక అర్జున్ రెడ్డి సినిమా ప్రభావం ఇంకా పోలేదని చెప్పక తప్పదు. అందుకే, క్లాస్ మూవీ అయినా కూడా గీత గోవిందం సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నతో లిప్ కిస్ పెట్టించారు. ఇది మరీ మాస్ రేంజ్‌లో లేకపోయినా కూడా అదిరిపోయిందనే చెప్పాలి. అది కొన్ని సెకండ్ల కిస్ అయినా కూడా సినిమా మొత్తం దాన్ని ఆధారంగా చేసుకొనే కథని అల్లారు.ఇక ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల మధ్య ఉన్న పెదవి ముద్దులు యూత్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి.


 అర్జున్ రెడ్డి సినిమాలో శాలినీ పాండేతో అన్ని పెదవి ముద్దులున్నా కూడా గీత గోవిందం ఇంకా డియర్ కామ్రేడ్ సినిమాలు కలిసి చేయడంతో ఇద్దరి మధ్య డీప్‌ లవ్ ఉందని..సీక్రేట్ గా ప్రేమాయణం కూడా సాగిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనికి కారణం కూడా ఇంకొన్ని చాలా బలంగా తోడయ్యాయి. హిందీ సినిమాల కోసం రష్మిక ముంబై వెళ్ళినప్పుడల్లా వీరిద్దరూ కలుసుకుంటున్నారు.విజయ్ లైగర్ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో రష్మికని కలుసుకొని వీరు ఇద్దరూ కలిసి డిన్నర్ అంటూ రోడ్ల మీద కనిపించారు. అందుకే, వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని ఇంకా త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ విషయంలో ఇద్దరూ కూడా ఇప్పటి వరకూ స్పందించలేదు. కాగా, రష్మిక మందన ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ అయి సినిమాల కోసం క్యాన్సిల్ చేసుకుంది. ఇక మన రౌడీ హీరో అంత దూరం వెళ్ళలేదు గానీ, అతని కోసం బాలీవుడ్ హీరోయిన్స్ కూడా వెంపర్లాడుతున్నారు.అయితే విజయ్, రష్మిక డేటింగ్ వార్త ప్రస్తుతం బి టౌన్ లో పెద్ద హాట్ టాపిక్ గా నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: