ఇప్పట్లో సినిమాల్లో లేడీ కమీడియన్స్ కాస్త తక్కువే. కానీ ఒకప్పుడు మాత్రం ఎక్కువగా మేల్ కమెడియన్స్ తో పాటు లేడీ కమెడియన్స్ కూడా పోటాపోటీగా ప్రేక్షకులను నవ్వించారు. డైలాగులతో కాదు తమ హావభావాలతోనే కామెడీ పండిస్తూ ప్రేక్షకులందరికీ కితకితలు పెట్టే వారు అనే చెప్పాలి. ఒకప్పుడు కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి కూడా ఉంది అన్న విషయం తెలిసిందే.


 ఇక్కడ శ్రీ లక్ష్మీ పేరు చెప్పగానే ఆమె సినిమాల్లో చిత్రవిచిత్రమైన హావభావాలు కొన్ని ప్రత్యేకమైన మార్కు డైలాగులు ప్రేక్షకుల మనసులో మెదులుతూ ఉంటాయి. వందల సినిమాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది శ్రీలక్ష్మి. ఇక ఏ సినిమాలో కనిపించిన ప్రేక్షకులకు నవ్వులు పంచకుండా అసలు ఊరుకోదు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ప్రేక్షకులను ఎంతో నవ్వించిన శ్రీ లక్ష్మీ జీవితంలో కన్నీళ్లు పెట్టించే విషాదం కూడా ఉంది అన్నది చాలా తక్కువ మందికి తెలుసు. శ్రీలక్ష్మి తండ్రి పేరు అమర్నాథ్ అప్పట్లో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు సంపాదించుకున్నారు.

 అయితే ఆయన నిర్మించిన కొన్ని సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన శ్రీ లక్ష్మి ఇక నటిగా ప్రయాణం మొదలుపెట్టి కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకుంది. అయితే వివాహం తర్వాత గర్భం దాల్చినప్పటికీ కూడా కుటుంబ బాధ్యతలు నేపథ్యంలో పిల్లలు వద్దు అనే సంచలన నిర్ణయం తీసుకుందట శ్రీలక్ష్మి. తర్వాత పిల్లలను కనొచ్చులే అంటూ భావించింది. కానీ అదే ఆమె పాలిట శాపంగా మారింది. చివరికి పిల్లల్ని కనాలి అనుకున్నప్పటికీ ఆమెకు పిల్లలు కాలేదు.


 కాస్త లేటు వయసులో అనారోగ్య సమస్యలు థైరాయిడ్ తో బాధ పడిన నేపథ్యంలో ఆమెకు తల్లి అయ్యే భాగ్యం లేకుండా పోయింది. ఇక శ్రీలక్ష్మి సోదరుడు రాజేష్ హీరోగా నటించాడు. అతని  కుమార్తె ఐశ్వర్య రాజేష్ అందరికీ సుపరిచితురాలే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ లక్ష్మీ చిన్నప్పుడు ఇక తన కుటుంబ సమస్యల నేపథ్యంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా అంటూ ఎమోషనల్ అయ్యింది. ఇలా ఎంతో బాధ మనసులో ఉన్నా తెర మీద మాత్రం నవ్వుతూ కనిపిస్తూ ప్రేక్షకులను నవ్వించింది శ్రీలక్ష్మి.

మరింత సమాచారం తెలుసుకోండి: