నిత్య మీనన్ ..అలా మొదలైంది సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది మలయాళ ముద్దుగుమ్మ.ఇక ఆ తర్వాత తెలుగులో ఇష్క్,గుండె జారి గల్లంతయ్యిందే వంటి సినిమాల్లో నటించింది.ఇకపోతే తెలుగులో ఆమె చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ తన అందం,అభినయంతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఇక ఆ తర్వాత కొంతకాలం మలయాళం, తమిళ సినిమాల్లో బిజీ అయిపోయింది. అయితే అందుకే కొంతకాలం టాలీవుడ్ లో కనిపించలేదు. కాగా ఈ మధ్య వచ్చిన భీమ్లా నాయక్ సినిమా తో మరోసారి టాలీవుడ్ లో మెరిసింది.

 ఓ ప్రముఖ సింగింగ్ షో కి జడ్జి గా కూడా వ్యవహరిస్తుంది.ఇదిలావుంటే ఇక మళ్లీ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చిన నిత్య మీనన్ ఇక వరుసగా సినిమాలు చేస్తుంది అనుకునే టైంలో ఒక్కసారిగా అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది.ఇక  అదేంటంటే.. ఇప్పటినుండి సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది.అయితే  ఇంస్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో ముచ్చటిస్తున్న సమయంలో యాక్టింగ్ కి బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నాను అని వెల్లడించింది. ఇకపోతే ఈ బ్రేక్ కేవలం తాత్కాలికం మాత్రమే అని కూడా క్లారిటీ ఇచ్చింది.

 అయితే ఎందుకంటే ఈ సంవత్సరం సినిమాలు,వెబ్ సిరీస్ లు, షో లలో చాలా రోజులు తీరిక లేకుండా పని చేయాల్సి వచ్చిందని అందుకే ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నానని నిత్యమీనన్ చెప్పుకొచ్చింది.ఈమె నేను బ్రేక్ తీసుకుంటున్నానంటే మీరు ఇంకా ఏదో ఊహించుకోకండి. ఇక ఆ బ్రేక్ నా పెళ్లి కోసం మాత్రం కాదని కూడా క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు అలాగే తనపై వస్తున్న పెళ్లి వార్తలను కూడా మరొకసారి ఖండించింది.ఇదిలావుంటే  ఇటీవల నిత్యామీనన్ పెళ్లి అంటూ ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతుంది అంటూ అనేక వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇక  ఈ వార్తలు వచ్చిన 24 గంటల్లోనే తన పెళ్లి రూమర్స్ కి చెక్ పెట్టింది నిత్యామీనన్. ఇకపోతే అప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన నాకు లేదని ప్రస్తుతం నేను నా కెరియర్ పై దృష్టి పెడుతున్నానని క్లారిటీ ఇచ్చింది. కాగా నిత్య మీనన్ ప్రస్తుతం కమిట్ అయిన సినిమా షూటింగ్స్ ని కంప్లీట్ చేసి ఆ తర్వాత కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటుందట...!!

మరింత సమాచారం తెలుసుకోండి: