ఏ దర్శకుడికైనా ఒక సినిమా పూర్తయిన తర్వాత మరొక సినిమాను వెంటనే మొదలుపెట్టి ఆ పనులలో నిమగ్నమై ఉంటే ఎంతో ఆనందం కలుగుతుంది. అలా కాకుండా సదరు సినిమా మధ్యలో ఆగిపోయి అనవసర కారణాల వల్ల కొట్టుమిట్టాడుతుంటే తప్పకుండా నిరాశే ఎదురవుతుంది. అలా దర్శకుడిగా తన ప్రతిభను ప్రేక్షకులకు చూపించి దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు క్రిష్. గమ్యం సినిమాతో తన టాలెంట్ ఏంటో నిరూపించుకొని ఆ తరువాత వేదం, కృష్ణం వందే జగద్గురు,  ఎన్టీఆర్ బయోపిక్ వంటి సినిమాలను చేశాడు.

ఆయన కెరియర్ లో బెస్ట్ సినిమా అంటే గౌతమీపుత్ర శాతకర్ణి అనే చెప్పాలి.  బాలకృష్ణను అంతటి స్థాయిలో అప్పటివరకు ఏ దర్శకుడు కూడా చూపించలేదు. ఒక చారిత్రాత్మక సినిమాను అతి తక్కువ సమయంలో రూపొందించవచ్చు అని చాలామంది క్రిష్ దగ్గర నుంచి నేర్చుకున్నారని చెప్పాలి. అలా దర్శకుడు క్రిష్ ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసి సినిమా పరిశ్రమలో గొప్ప దర్శకుడిగా ఎదిగాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తదుపరి సినిమాను చారిత్రాత్మక నేపథ్యంలో ఎంచుకోవడం అందరిలో ఎంతో ఆసక్తిని కలిగించింది. 

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా లో ఇక్కడ అసలు విశేషం అయితే ఈ సినిమాను ఏ ముహూర్తాన మొదలు పెట్టారో తెలియదు కానీ ఈ చిత్రానికి అడుగడుగునా ప్రమాదాలే పొంచి ఉంటున్నాయి అని చెప్పవచ్చు. ఈ సినిమా యొక్క మొదటి షెడ్యూల్ షూటింగ్ జరిగి రెండు సంవత్సరాలు కావస్తున్న కూడా తదుపరి షెడ్యూల్ ఇంకా మొదలు కావడం లేదు. దానికి కారణం పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు డేట్లు ఇవ్వకపోవడం అని తెలుస్తుంది. ఆయనకు ఉన్న రాజకీయ బిజీ వల్ల ఇతర సినిమాల కమిట్ మెంట్ ల వల్ల ఈ సినిమాను అంతకంతకు పోస్ట్ ఫోన్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అయితే వ్యవహారంలో బాగా నష్టపోతుంది మాత్రం క్రిష్ అనే చెప్పాలి. మరొక సినిమా చేయడానికి లేకుండా పవన్ కళ్యాణ్ దర్శకుడుని ఇంతలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: