ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎంతో అయోమయంలో ఉంది. మొన్నటిదాకా చిత్ర పరిశ్రమంలోని కార్మికులు స్ట్రైక్ చేసి సినిమా చిత్రీకరణలు ఆపేస్తే ఇప్పుడు నిర్మాతలు సినిమా చిత్రీకరణలు ఆపేశారు. వారు స్ట్రైక్ చేయడం ఇప్పుడు ఎంతో చర్చనీయాంశం అయింది. కారణం ఏదైనా ఒకటి తర్వాత ఒకరు ఇలా స్ట్రైక్ చేయడం సినిమా పరిశ్రమకు బారి నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఓవైపు థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గడంతో సినిమాలకు భారీ కలెక్షన్లు రావడం లేదు.

ఓ టీ టీ లో కూడా కంటెంట్ పెరిగిపోవడంతో థియేటర్లలో సినిమాలు చూసే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలోని పెద్ద హీరోలు పెద్దమనసు చేసుకొని ఈ వ్యవహారాన్ని సద్దుమణిగించేలా చేయాలని కొందరు భావిస్తున్నారు. కానీ సినిమా పరిశ్రమలో పెద్ద హీరోలుగా ఉన్న చాలామంది ఈ వ్యవహారంలో తల దూర్చకపోవడం నిజంగా అందరినీ ఎంతగానో నిరుత్సాహపరుస్తుంది. చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ లాంటి వారు మౌనంగా ఉండడం దేనికి సంకేతమో తెలియడం లేదు. 

గతంలో మెగాస్టార్ చిరంజీవి చాలా సమస్యల్లో ఎంటర్ అయ్యి సదరు సమస్యను పూర్తిగా పరిష్కరించారు. దాసరి నారాయణరావు తర్వాత అంతటి పెద్దరికంతో వ్యవహరిస్తున్న చిరంజీవి ఈ వ్యవహారాన్ని కూడా సాల్వ్ చేసి చిత్ర నిర్మాణాలకు స్టార్ట్ ఇవ్వాలని కొంతమంది కోరుకుంటున్నారు. ఇటు నాగార్జున బాలకృష్ణ కూడా తల చేయవేసి ఈ సమస్యను పరిష్కరించాలని చెబుతున్నారు. మరి వీరు ఎప్పుడు ఎంటర్ అవుతారో చూడాలి. వీరు ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరి ఈ స్ట్రైక్ ల పర్వం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి. ఈ స్ట్రైక్ వల్ల నార్మల్ గా సినిమా పరిశ్రమలో పనిచేసుకునే చాలామంది కార్మికులు ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. రోజు వారి బ్రతికే వారికి ఇది ఎంతో కష్టంగా మారుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: