తెలుగు చిత్ర పరిశ్రమకు రైటర్గా పరిచయం అయ్యి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు త్రివిక్రమ్. హీరో అంటే పేజీలకు పేజీలు డైలాగులు చెప్పాలి అనే ట్రెండ్ నుంచి పేజీల డైలాగులు అవసరంలేదు ప్రాస తో కూడిన చిన్న పంచ్ డైలాగులు చెబితే చాలు ప్రేక్షకులను   ఉర్రూతలూగించవచ్చు అని నిరూపించాడు త్రివిక్రమ్. తన కలం నుంచి జాలువారిన ఎన్నో పంచ్ డైలాగులు ప్రేక్షకులందరినీ కూడా ఉర్రూతలూగిస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వరకు త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమాలు చూస్తే ఇక అన్ని సినిమాల్లో కూడా ఒక సీన్ మాత్రం తప్పకుండా ఉంటుంది అని చెప్పాలి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

 జులాయి : త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జులాయి సినిమాలో విలన్ సోను సూద్ తమ్ముడు చనిపోవడంతో కథ కీలక మలుపు తిరుగుతోంది.

 సన్నాఫ్ సత్యమూర్తి : అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ తండ్రి చనిపోవడం కారణంగా ఇక కథ మలుపు తిరుగుతుంది అని చెప్పాలి.

 అత్తారింటికి దారేది : పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తల్లి గన్ షూట్ లో చనిపోతుంది. అప్పటి నుంచి కథ మలుపు తిరుగుతుంది అని చెప్పాలి.

 అ ఆ : నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాలోని తన తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో అక్కడి నుంచి కథ అసలు మలుపు తిరుగుతుంది.

 అరవింద సమేత :: ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి గా నటించిన నాగబాబు చనిపోతాడు. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది.

 అజ్ఞాత వాసి : పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి చనిపోయిన తర్వాత కథలో కీలక మలుపు చూడవచ్చు.

 ఖలేజా : మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో ఒక డాక్టర్ చనిపోయి మహేష్ బాబు కార్ మీద పడటంతో కథ మలుపు తిరుగుతుంది. ఇక అంతకు ముందు వచ్చిన అతడు సినిమాలో పార్థు పాత్ర చనిపోవడం కారణంగా కథ మలుపు తిరుగుతుంది.  ఇక అలా వైకుంఠపురం సినిమాలో కూడా ఒక నర్స్ చనిపోవడంతో అక్కడి నుంచి కథ మలుపు తిరిగి రసవత్తరంగా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: