తమిళనాడులో ఉన్న కొంతమంది దర్శకులు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో చాలామంది తమిళ దర్శకులు తెలుగులో సినిమా లు చేసి మంచి విజయాలను అందుకున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది దర్శకులు తెలుగులో సినిమాలు చేస్తూ తమకు మంచి మార్కెట్ ఏర్పడే విధంగా సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆ విధంగా మురుగదాస్ ఇప్పుడు మరొక తెలుగు సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడా అన్న వార్తలు ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి.

తెలుగులో స్టాలిన్ సినిమా ద్వారా దర్శకుడిగా ఆయన పరిచయమయ్యాడు. అంతకుముందు కొన్ని డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ దర్శకుడు అప్పుడు తెచ్చుకున్న క్రేజ్ తో చిరంజీవితో సినిమా చేసే అవకాశం అందుకుని ఆ సినిమా తో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ సినిమా ఫలితం కాస్త అటు ఇటు అయినా కూడా దర్శకుడుగా మాత్రం ఆయన సక్సెస్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఆ తరువాత మళ్లీ చాలా రోజులకు స్పైడర్ చిత్రంతో తెలుగులో దర్శకుడుగా సినిమా చేశాడు.

సినిమా ప్రేక్షకులను నిరాశపరచడంతో మళ్లీ ఇక్కడ సినిమా చేయడానికి ఆలచించాడు. ఇన్ని రోజుల తర్వాత ఆయన మళ్ళీ తెలు గు సినిమా చేస్తూ ఉండడం ఆయన అభిమానులను ఆనందపరుస్తున్నా కూడా ఎక్కడ తన గత సినిమాల తాలూకు ఫలితాలు రిపీట్ అవుతాయో అన్న టెన్షన్ అందరిలో నెల కొంది. తమిళంలో ఆయన చేసే సినిమాలకు మంచి క్రేజ్ నెలకొంది. అవి తెలుగులో దబ్ అయి మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి చేయబోయే డైరెక్ట్ తెలుగు సినిమా మంచి విజయం సాధించి ఆ సెంటిమెంటును తుడిచిపెట్టుకుని పోయేలా చేయాలని ఆయన అభిమానులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియని ఉన్నాయి. ఓ పెద్ద హీరోతో కలిసి అయన ఈ సినిమా చేయబోతున్నాడని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: