దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతా రామం సినిమా ఆగస్ట్ 5 వ తేదీన  భారీ ఎత్తున విడుదల అయ్యి విడుదల అయిన మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను సాధించుకొని భారీ బ్లాక్ బస్టర్ విజయం వైపు దూసుకుపోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని అన్ని దేశాలతో పాటు 'యూ ఏ ఈ'  కూడా ఆగస్ట్ 5 వ తేదీన విడుదల చేయాలి అని సీతా రామం మూవీ యూనిట్ ప్రణాళికలు వేసుకుంది. కానీ చివరి నిమిషంలో ఈ సినిమా సెన్సార్ విషయంలో కొన్ని కారణాల వల్ల ఈ మూవీ ని 'యూ ఏ ఈ' దేశంలో ఆగస్ట్ 5 వ తేదీన విడుదల కాలేదు. ఇది ఇలా ఉంటే సీతా రామం మూవీ యూనిట్ తాజాగా ఈ మూవీ 'యు ఏ ఈ' దేశంలో విడుదలకు సంబంధించిన అదిరి పోయే అప్డేట్ ను విడుదల చేసింది. 

ఈ దేశంలో సీతా రామం మూవీ ని ఆగస్ట్ 11 వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ లో రష్మిక మందన ఒక కీలక పాత్రలో నటించగా , తరుణ్ భాస్కర్ , భూమిక చావ్లా , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , సుమంత్  ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.  ప్రకాష్ రాజ్ , ప్రియదర్శి , సునీల్మూవీ లో మరి కొన్ని ముఖ్య పాత్ర లలో నటించారు. ఈ మూవీ ని వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ లపై  ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: