తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి టాలెంట్ ఉన్న నటీమణులలో ఒకరు ఆయన హరితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హరితేజ ఇప్పటివరకూ తన కెరీర్ లో ఎన్నో పాత్రల్లో నటించి ఎంతో మంది గొప్ప గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా హరి తేజ, నితిన్ హీరోగా సమంత హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ ఆ' మూవీ లోని తన నటనతో ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది. 

సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను అలరించిన హరితేజ తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయిన బిగ్ బాస్ లో కూడా పార్టిసిపేట్ చేసింది. బిగ్ బాస్ టీవీ షో ద్వారా హరితేజ ఎంతో మంది బుల్లితెర అభిమానులను కూడా సంపాదించింది. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక హరితేజ ఎన్నో టీవీ షో లలో ముఖ్య అతిథిగా కూడా విచ్చేసి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా, టీవీ షో ల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హరితేజ సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు వారితో టచ్ లోకి కూడా వస్తూ ఉంటుంది. 

సోషల్ మీడియా వేదికగా హరితేజ తనకు సంబంధించిన ఫోటోలను కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా హరితేజ తాజాగా తన కు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. హరితేజ తాజాగా తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం హరితేజ కు సంబంధించిన ఈ ఫోటోలు నెటింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: