మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్ లో ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించి ఇప్పటికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు . ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీ లలో ఘరానా మొగుడు మూవీ కూడా ఒకటి .

మూవీ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా నగ్మా , వాణి విశ్వనాథ్ హీరోయిన్ లుగా నటించారు . ఈ మూవీ కి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు . ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో కీలక పాత్ర ను పోషించింది.  రావు గోపాల్ రావు ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు. అప్పట్లో ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలవడం మాత్రమే కాకుండా , కలెక్షన్ ల వర్షాన్ని కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కురిపించింది.

ఇలా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఘరానా మొగుడు మూవీ ని మరో సారి థియేటర్ లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అసలు విషయం లోకి వెళితే ... ఆగస్ట్ 22 వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఘరానా మొగుడు మూవీ ని ఆగస్ట్ 21 మరియు 22 తేదీ లలో ప్రసాద్ సినిమాస్ లలో వేయనున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: