అల్లరి నరేష్ హీరో గా తెరకెక్కిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే తన అందచందాలతో కుర్రకారును కట్టి పడేసిన ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి తన అంద చందాలతో , నటనతో ప్రేక్షకులను మనసు దోచుకుంది .

ఇది ఇలా ఉంటే తాజాగా శ్రద్దా దాస్ 'అర్థం' అనే మూవీ లో ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ మూవీ సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కబోతుంది. ఈ మూవీ లో శ్రద్దాదాస్ 'మాయ' అనే సైకాలజిస్ట్ పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ కి మణికాంత్ తెల్లగూటి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ని రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని కన్నడ, మలయాళ భాషల్లోకి కూడా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

మూవీ టీజర్ విడుదల సందర్భంగా శ్రద్ధాదాస్ మాట్లాడుతూ ... ఇప్పటి వరకూ తాను నటించిన మూవీ లన్నింటిలో కెల్లా ఈ మూవీ చాలా స్పెషల్ అని శ్రద్దాదాస్ చెప్పింది. దర్శక నిర్మాతలు చక్కని కథను సెలెక్ట్ చేసుకుని ఈ మూవీ ని కూడా చాలా చక్కగా తెరకెక్కించారని శ్రద్దాదాస్ తెలిపింది. ఈ మూవీ లో గ్లామరస్ సైకియాట్రిస్ట్ గా తాను నటించానని చెప్పు కొచ్చింది. మంచి టీమ్ తో మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ లో నటించడం చాలా హ్యాపీగా ఉందని శ్రద్దాదాస్ తాజాగా తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: