సాధారణంగా సినీ తారలు ఇండస్ట్రీలో ఒక్క సినిమా హిట్ కాగానే వారి రెమ్యూనరేషన్ అమాంతం పెంచేస్తూ వుంటారు. అయితే ఇందులో ముక్యంగా హీరోయిన్ లు అన్నమాట. సీరియల్స్‌ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చింది మృణాల్‌ ఠాగూర్. అయితే మరాఠిలో చాలా టీవీ సీరియల్స్‌లో నటించిన ఆమె.. అక్కడ బాగా పాపులర్ అయ్యింది.. ఇక ఆ తర్వాత బాలీవుడ్‌ చిన్ని చిన్న సినిమాలు చేస్తూ వెండితెరపై నటిగా ఎదిగింది.  అంతేకాదు ఈ క్రమంలో ఆమె హిందీ జెర్సీలో హీరోయిన్‌గా చాన్స్‌ కొట్టేసింది. ఇక అదే ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది.ఇకపోతే హిందీలో జెర్సీ సినిమా యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ మృణాల్‌ గ్లామర్ .. ఆమె నటకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక దాంతో టాలీవుడ్ మేకర్స్ కన్ను ఆమెపై పడింది. కాగా దీంతో తెలుగులో సీతారామం మూవీ ఆఫర్‌ అందుకుంది.  

అయితే ప్రస్తుతం ఆమె చేతిలో ఓ తెలుగు సినిమా, హిందీలో నాలుగు వరకూ.. పెద్ద సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది.అంతేకాదు  అటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తోందట బ్యూటీ.అయితే వచ్చి రావడంతోనే ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ సాధించింది.ఇక  మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ తో ఆమె జంటగా నటించిన సీతారామం భారీ విజయం అందుకుంది. అంతేకాకుండా అనూహ్యమైన విజయంతో టీమ్ అంతా ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే అటు మృణాల్‌ ఠాకూర్‌ కూడా పట్టలేని సంతోషం వ్యక్తం చేసింది. ఇకపోతే  ఈ సినిమాతో ఆమెకు తెలుగులో మంచి డిమాండ్‌ పెరిగినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో ఆమెకు డిమాండ్‌ పెరగడంతో.. వరుఆఫర్లు కూడా తలుపు తడుతున్నాయట..

ఇక దాంతో మృణాల్‌ ఠాకూర్‌ భారీగా రెమ్యునరేషన్‌ పెంచిందనే టాక్‌ వినిపిస్తోంది.అయితే  వైజయంతి బ్యానర్లో స్వప్న సినిమా పతాకంపై మృణాల్ కు సినిమా ఛాన్స్ వచ్చిందట. ఇక నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది.కాగా  ఇందులో ఇప్పటికే మృణాల్‌ను ఖరారు చేశారని, ఆమె ఈ ప్రాజెక్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చిందని తెలుస్తోంది. సినిమాకు ఆమె ప్రస్తుతం కోటీ రూపాయల డిమాండ్‌ చేస్తోందని సమాచారం.ఇక  దీంతో ఫస్ట్ సినిమా హిట్ అయ్యిందో లేదో.. అప్పుడే ఇంత డిమాండ్ చేస్తోందేందని ఫిల్మ్ మేకర్స్ విస్తు పోతున్నారట.అయితే  ఆమె ఆ నెంబర్ చెప్పగానే అవాక్కవుతున్నారట. ఇక ఇప్పుడే ఇంత డిమాండ్ చేస్తోంది.. ముందు ముందు ఆమెను ఆపగలమా అని నిర్మాతలు చర్చించుకుంటున్నట్టు సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: