ప్రస్తుతం  టాలీవుడ్ లో వరంగల్ శ్రీను పేరు  ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ఒక నిర్మాత రెండు మూడు సినిమాలను నిర్మించి 100 కోట్ల వరకు నష్ట పోయాడు అంటే నిజమే అనుకోవచ్చు, కానీ ఒక డిస్టిబ్యూటర్ ఏకంగా రూ.100 కోట్ల రూపాయలను నష్టపోయాడు అంటే ఏ ఒక్కరూ నమ్మలేరు.  నిజంగానే ఈ డిస్ట్రిబ్యూటర్ నష్ట పోయాడు. ఇక ఆయన మరెవరో కాదు వరంగల్ శ్రీను. పట్టుదలకు, పంథానికి వెళ్లిన ఈయన ఆచార్య సినిమా ను భారీ మొత్తానికి కొనుగోలు చేశాడు.కాగా  ఆ తర్వాత విరాటపర్వం సినిమా ను కూడా ఈయనే భారీ మొత్తానికి కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి ప్రయత్నించాడు.

ఇకపోతే  తాజాగా విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కి భారీ అంచనాల నడుమ విడుదలైన లైగర్ సినిమా ను కూడా ఈయనే తెలుగు రాష్ట్రాల్లో భారీ మొత్తానికి కొనుగోలు చేశారు. అయితే దాదాపుగా 75 కోట్ల రూపాయలను పెట్టి లైగర్ సినిమాను ఈయన కొనుగోలు చేశాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ఇక ప్రస్తుతం ఆ సినిమా రాబడుతున్న వసూళ్ల గురించి అందరికీ తెలిసిందే, కనీసం ఆయన పెట్టిన పెట్టుబడిలో 50% కూడా వెనక్కు వచ్చే పరిస్థితి లేదు. అయితే దాంతో భారీ ఎత్తున నష్టాలను చవిచూడాల్సి రావచ్చు అంటున్నారు.  ఈ రెండు సినిమాల విషయానికి వస్తే..

ఆయన ఏకంగా వంద కోట్ల రూపాయలను నష్ట పోయాడు అంటున్నారు.అయితే  డిస్ట్రిబ్యూటర్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న వరంగల్ శ్రీను ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది, ఆయనకు ఇలా ఒకేసారి రూ. 100 కోట్ల నష్టం రావడంతో ముందు ముందు సినిమా డిస్ట్రిబ్యూషన్లో ఉంటాడా లేదా అని అనుమానాలను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరలోనే నిర్మాణం లోకి కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తన ప్రత్యర్థి అయినా దిల్ రాజుకు గట్టి పోటీ ఇచ్చేందుకు త్వరలోనే భారీ ఎత్తున నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఆ విషయంలో క్లారిటీ లేదు కానీ తాజాగా వచ్చిన 100 కోట్ల నష్టం ఆయనకు తీవ్రని నష్టం అంటూ సినీ వర్గాల వారు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: