ప్రస్తుతం రెండు పడవల ప్రయాణం కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ ఎప్పుడు విడుదల అవుతుందో అతడి అభిమానులకు కూడ తెలియని పరిస్థితి. ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న క్రిష్ కూడ ఈ మూవీ విడుదల తేదీ పై క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడని అంటున్నారు. దీనికి కారణం పవన్ తాను నటిస్తున్న సినిమాల పై అనుసరిస్తున్న తీరు.


పవన్ కళ్యాణ్ తో సినిమా తీసే దర్శక నిర్మాతలకు పవన్ ఎప్పుడు షూటింగ్ లకు వస్తాడో మరెప్పుడు బ్రేక్ ఇస్తాడో తెలియని పరిస్థితి. వాస్తవానికి పవన్ పూర్తి చేయవలసిన సినిమాల లిస్టు పెద్దదిగానే ఉంది. పవన్ కళ్యాణ్ అంగీకరిస్తే మరికొన్ని సినిమాలు తీయడానికి అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలు క్యూ కడుతూనే ఉన్నాయి.



అయితే పవన్ దృష్టి అంతా రాజకీయాల పై ఉండటంతో అతడి సినిమాల పై క్లారిటీ ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈమధ్య సోషల్ మీడియాలో ఛాటింగ్ చేస్తున్న దర్శకుడు హరీష్ శంకర్ కు పవన్ అభిమానుల నుండి ఒక ప్రశ్న ఎదురైంది. ‘గబ్బర్ సింగ్’ సినిమా లాంటి మరొక సినిమా పవన్ కళ్యాణ్ తో ఇక తీయరా అన్న ప్రశ్నకు హరీష్ సమాధానం ఇస్తూ కొంచం ఓపిక పట్టండి మీ కోరిక తీరుస్తాను అంటూ సమాధానం ఇచ్చాడు.


దీనితో హరీష్ శంకర్ కు పవన్ కళ్యాణ్ తో తీయవలసిన మూవీ గురించి ఇంకా ఆశలు సజీవంగానే ఉన్నట్లు అనిపిస్తోంది. ‘భవధీయుడు భగత్ సింగ్ అన్న టైటిల్ తో హరీష్ శంకర్ తీయవలసిన ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావలసి ఉంది. అయితే ఈమూవీ కథ రెడీ అయినప్పటికీ పవన్ డేట్స్ ఇవ్వడంలో చేస్తున్న అలసత్వంతో ఈ మూవీ పై పవన్ అభిమానులు ఆశలు వదులుకున్నారు. ఇలాంటి పరిస్థితులలో హరీష్ శంకర్ ఇచ్చిన సమాధానంతో తిరిగి పవన్ అభిమానులలో ఆశలు చిగురిస్తున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: