టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాకు ఏ మాత్రం మంచి స్పందన రాకపోవడం, అట్టర్ ఫ్లాప్ అవ్వడం ఇంకా అలాగే కార్తికేయ 2 సినిమా సూపర్ హిట్ కావడం కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉందని లైగర్ నిర్మాతల్లో ఒకరైన చార్మి తెలిపింది.ఛార్మి అభిప్రాయం ప్రకారం ఇప్పుడు మేకర్స్ ప్రేక్షకులను థియేటర్ల దాకా రప్పించాలంటే ఎక్కువ పని చేయాలని ఏదేదో సోది చెప్పుకొచ్చింది. తాజాగా ఒక నేషనల్ ఛానల్ తో మాట్లాడిన ఛార్మి లైగర్ సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.బాలీవుడ్ సినిమాలు ఫ్లాప్ అవ్వడం వెనుక కొన్ని ఆసక్తికరమైన కారణాలను ఆమె చెప్పింది. అదేమిటంటే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే ఎక్కువ కష్టపడాలని ఓటీటీ కంటెంట్ విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత మేకర్స్ చాలా జాగ్రత్తగా సినిమాలు చేయాల్సి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. ప్రేక్షకులకు ఒక్క క్లిక్ లోనే ప్రపంచమంతా అందుబాటులో ఉందని ఎంత భారీ బడ్జెట్ సినిమాలైనా కుటుంబం అందరూ కలిసి థియేటర్లలో చూడటం కంటే టీవీలో చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పుకొచ్చింది.వాళ్ళని నిజంగా ఎక్సైట్ చేసే సినిమా ఏదైనా ఉంటే అప్పుడు థియేటర్లకు వస్తున్నారు కానీ లేకపోతే రావడం లేదని చెప్పింది.


 బాలీవుడ్ ప్రేక్షకుల సంగతి అలా ఉంటే తెలుగులో మూడు సినిమాలు బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సినిమాలు విడుదలై మూడూ కలిపి 170 కోట్ల మార్కెట్ చేశాయని అదే దేశంలో లైగర్ సినిమా పత్తా లేకుండా పోయిందని చెప్పుకొచ్చింది. దక్షిణాది ప్రజలు సినిమాల మీద అంతలా ఆసక్తి చూపిస్తారని ఆమె పేర్కొన్నారు. అయితే లైగర్ నిరాశ పరచడానికి అనేక సార్లు వాయిదా పడటం కూడా కారణమై ఉండొచ్చని చార్మి అభిప్రాయపడింది.రెండేళ్లు క్రితమే టైగర్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభించామని కరోనా కారణంగా రెండేళ్ల పాటు షూటింగ్ జరిపిన తర్వాత 2022 ఆగస్టులో సినిమా బయటకు వచ్చిందని చెప్పుకొచ్చింది. కచ్చితంగా మేము థియేటర్లలోనే సినిమా రిలీజ్ చేయాలనుకున్నాము కానీ అప్పటికే మా తెలుగు సినీ పరిశ్రమ నుంచి సిద్ధంగా ఉన్న ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి సినిమాలు ముందు బయటకు రావడానికి మేము వెయిట్ చేశామని చెప్పింది.అలా చాలా కష్టాలు పడ్డాము కానీ ఎప్పుడూ వెనకడుగు వేయలేదని ఛార్మి చెప్పింది. అయితే లైగర్ లాంటి సినిమా పేలవమైన ప్రదర్శనలు చేస్తూ ఉండడం కార్తికేయ సినిమా ఇంత హిట్ కావడం చాలా కన్ఫ్యూషన్ కి గురి చేసిందని చార్మి పేర్కొనడం చూస్తుంటే ఆమె కార్తికేయ సక్సెస్ జీర్ణించుకోలేకపోతోందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.దీనిపై నెటిజన్స్ ఆమెను బండ బూతులు తిడుతూ ట్రోల్ చేస్తున్నారు. మనం నాశనమయ్యిన పర్లేదు పక్కోడు బాగుపడకూడదా ఛార్మి అంటూ ట్రోల్ చేస్తున్నారా?

మరింత సమాచారం తెలుసుకోండి: