ఒకే రకం మూస పద్ధతిలో సినిమాలు చేస్తే ఏ హీరో ని కూడా ప్రేక్షకులు పెద్దగా ఆదరించరు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం సినిమాలు చేస్తే వారిలోని కొత్తదనం ప్రేక్షకులకు పరిచయమవుతుంది. అంతేకాదు సదరు పాత్రలో వారు నటించే తీరును బట్టి ఎంతోమంది ప్రేక్షకులు వారికి అభిమానులుగా మారిపోతూ ఉంటారు. అందుకే హీరోలందరూ కూడా కొత్త సినిమాలను సరికొత్త రకమైన పాత్రలను చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒక హీరో మాత్రం ఒకే రకమైన సినిమాలను చేస్తూ ప్రేక్షకులను బోర్ కొట్టిస్తున్నాడు అన్న వార్తలు బయటకు వినిపిస్తున్నాయి.

సోలోగా సినిమా పరిశ్రమంలోకి ఎంట్రీ ఇచ్చి అగ్ర హీరోగా ఎదిగిన రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో వైవిధ్యతను కనబరచక పోవడం ఆయన అభిమానులను కొంత నిరాశ పరుస్తుంది. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఆయన గతంలో సినిమాల పట్ల కొంత వైవిధ్యతను చూపించిన కూడా ఇటీవల చేస్తున్న సినిమాలతో ఏ మాత్రం కొత్తదనాన్ని చూపించలేకపోతున్నాడట. దీని పట్ల అభిమానులు ఎంతో అసహనం వ్యక్తపరుస్తున్నారు.

 వరుస చిత్రాలు ప్లాప్ అవుతున్న కూడా అదే రకమైన సినిమాలను చేయడానికి ఆయన ఎక్కువగా ఆసక్తి చూపించడం ఆయన పట్ల వారిలో కొంత ఆగ్రహాన్ని కూడా తెప్పిస్తుంది. ఇకపై చేయబోతున్న సినిమాలు కాస్త వెరైటీగా ఉన్నప్పటికీ వాటి ద్వారా ప్రేక్షకులను ఆయన ఏ స్థాయిలో మెప్పిస్తాడు అన్న సందేహం ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవితో కలిసి బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా రవితేజ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాలు రవితేజకు మంచి విజయాలను తీసుకువచ్చి ప్రేక్షకులను అలరిస్తాడా అనేది చూడాలి. రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు, ధమాకా సినిమాలతో అయన ప్రేక్షకులను అతి తక్కువ వ్యవధిలోనే అలరించనున్నాడు. ఆ సినిమాలన్నీ కూడా ఆయనకు ఏ స్థాయి లో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: