సీనియర్ నటి టబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలో వైవిద్యమైన నటనతో ప్రేక్షకులను బాగా అలరించింది. తెలుగు, తమిళ్ ,మలయాళం వంటి చిత్రాలలో కూడా నటించి మంచి పేరును సంపాదించుకుంది ఇక తన అందచందాలతో ఇప్పటికీ కుర్రకారులను సైతం ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె వయసు 50 ఏళ్లు దాటినా కూడా ఇప్పటివరకు వివాహం మాట ఎత్తలేదు. ఇక స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న సమయంలో ఒకరిద్దరూ హీరోలతో ఈమె ఎఫైర్ ఉన్నట్లుగా కూడా రూమర్స్ వచ్చాయి.


ఇక వివాహం గురించి అడగగా తనకి నచ్చిన వరుడు దొరకలేదని తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పెళ్లి విషయంపై టబు పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. మీరు ఇంతవరకు వివాహం చేసుకోలేదు అని ప్రశ్న ఎదురవ్వగా.. మీరు అమ్మ అనిపించుకోవాలని ఆశ లేదా.. అనే ప్రశ్న ఎదురవ్వగా.. అందుకు టబు మాట్లాడుతూ తల్లి కావడానికి పెళ్లి కావాల్సిన అవసరం లేదని గాటుగా స్పందించింది. ఇక పెళ్లికి పిల్లలకి వయసుతో ఎలాంటి సంబంధం లేదని కూడా తెలియజేసింది టబు.


తల్లి అవ్వాలనుకుంటే వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు.. పెళ్లి కాకుండానే గర్భవతి కావచ్చు సరోగసి ద్వారా కూడా తల్లి అయ్యే అవకాశం ఉంటుందని.. అలా చేసిన తనని ఎవరు ఆపేవారు లేరని తెలియజేసింది టబు. ప్రస్తుతం డబ్బు కెరియర్ పరంగా సినిమాలలో ఇంకా నటిస్తూ ఉన్నది. ఇక పెళ్లికి పిల్లలకి వయసుతో సంబంధం లేదని ఈ రోజుల్లో దేనికి కూడా సంబంధం లేదని టబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కూలి నెంబర్ వన్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నిన్నే పెళ్ళాడుతా తదితర సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: