టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే నాగ చైతన్య ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు . ఇది ఇలా ఉంటే ఇప్పటికే నాగ చైతన్య ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదల అయిన బంగార్రాజు మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందు కున్నాడు.

ఆ తర్వాత ఈ సంవత్సరం థాంక్యూ మరియు లాల్ సింగ్ చడ్డా మూవీ లతో నాగ చైతన్య  ప్రేక్షకులను పలకరించాడు. థాంక్యూ మూవీ లో నాగ చైతన్య హీరోగా నటించగా లాల్ సింగ్ చడ్డా మూవీ లో నాగ చైతన్య ఒక కీలక పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య , విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. అలాగే తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో కూడా నాగ చైతన్య నటించడానికి రెడీగా ఉన్నాడు.

మూవీ లో నాగ చైతన్య కు జోడిగా కృతి శెట్టి నటించబోతుంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన కొన్ని కీలక విషయాలను మూవీ యూనిట్ తెలియజేసింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య నటించబోయే సినిమా నాగ చైతన్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ మూవీ అని , ఈ మూవీ పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కబోతున్నట్లు, ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల మూడో వారం నుండి ప్రారంభం కాబోతున్నట్లు మూవీ యూనిట్ తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: