అక్కినేని నాగార్జున.. ఆరు పదుల వయసులో కూడా టాలీవుడ్‌ 'మన్మథుడు' అనిపించుకుంటున్న ఏకైక హీరో. రొమాంటిక్‌ హీరోగా ఒక ఇమేజ్‌ క్రియేట్ చేసుకుని, ఆ ఇమేజ్ ను ముప్పై ఐదేళ్లుగా బ్యాలెన్స్‌ చేస్తూ..

రెండు తరాల మహిళలకు కలల రాకుమారుడిగా నాగార్జున తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రతి హీరోకి వందో సినిమా ఎంతో కీలకం. ఇప్పటికే చిరు, బాలయ్య తమ వంద సినిమాలను పూర్తి చేసుకున్నారు. మరి నాగ్ ఎప్పుడు తన వందో సినిమా చేస్తాడు ?.

ప్రస్తుతం కింగ్ నాగార్జున - ప్రవీణ్ సత్తారు కలయికలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ఘోస్ట్' రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ, 'ప్రవీణ్ సత్తారుకు టెక్నికల్‌గా చాలా పట్టుంది. ఇప్పటివరకు అతనితో సినిమా ఎందుకు చేయలేదా అని బాధపడుతున్నా. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇంకా డిసైడ్ కాలేదు. వందో చిత్రం గొప్పగా ఉండాలని ఇప్పటినుంచే కథలు వింటున్నా' అని నాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

దీంతో నాగ్ వందో సినిమా పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. నాగార్జున 100వ చిత్రం కాబట్టి, భారీ హైప్ ఉంది. వ్యాపారం బాగా జరుగుతుందని భావిస్తున్నారు. అందుకే, నాగార్జున ఈ సినిమాని చారిత్రక నేపథ్యంలో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడు. అప్పుడు అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా సందడి చేస్తారని.. సినిమా పై ఆసక్తి చూపిస్తారని నాగ్ భావిస్తున్నాడు.

అందుకే.. చరిత్రలో ఓ గొప్ప రాజుకు సంబంధించిన కథను నాగ్ తన వందో సినిమాగా చేస్తాడట. ఇక నాగార్జున అంటే ఒక సినిమాలే కాదు, గ్రేట్ బిజినెస్ మెన్ కూడా. మా టీవీలో పెట్టుబడులు పెట్టి, మా టీవీ రేంజ్‌ ను పెంచాడు. ఇక నాగ్ గేమ్స్ లో కూడా ఇన్ వాల్వ్ అయ్యాడు. హీరోగా కొనసాగుతూనే అనేక జట్లకు సహ యజమానిగా పెట్టుబడులు పెట్టాడు.

 
ఈ క్రమంలోనే ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ 'ముంబై మాస్టర్స్‌'కు సునీల్‌ గవాస్కర్‌ తో కలిసి పెట్టుబడులు పెట్టాడు. అలాగే ధోనీతో కలిసి మహీ రేసింగ్‌ టీం ఇండియాకు కూడా పెట్టుబడులు పెట్టాడు. ఇక ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ క్లబ్‌ లో కేరళ బ్లాస్టర్‌ ఎఫ్‌సీ కి కూడా నాగార్జున సహ యాజమానిగా ఉన్నాడు. పైగా అక్కినేని నాగార్జున గతంలో రెండుసార్లు ఫోర్బ్స్‌ టాప్‌ 100 సెలబ్రిటీల లిస్ట్‌లో కూడా చోటు సంపాదించడం విశేషం.

ఏది ఏమైనా తెలుగుతెరపై చెరిగిపోని ముద్రవేశాడు నాగ్. లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందిపుచ్చుకుని.. తెలుగు స్టార్ హీరోల్లో ఒకడిగా నాగార్జున విజయవంతం అయ్యాడు. నాగార్జున ఏయన్నార్‌ 'సుడిగుండాలు' చిత్రంలో బాలనటుడిగా చేశాడు. అప్పటి నుంచి నేటి వరకు హీరోగా రాణిస్తూనే ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: