తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోల్లో ఒకరు అయినటు వంటి సుధీర్ బాబు తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ లో కృతి శెట్టి సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా నటించగా , ఇంద్రగంటి మోహనకృష్ణమూవీ కి దర్శకత్వం వహించాడు.  ఈ రోజు అనగా సెప్టెంబర్ 16 వ తేదీన ఈ మూవీ గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల కాబోతుంది.

మూవీ విడుదల సందర్భంగా వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ వస్తున్న సుధీర్ బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సుధీర్ బాబు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా సుధీర్ బాబు మాట్లాడుతూ ...  రన్బీర్ కపూర్ హీరోగా ఆలియా భట్ హీరోయిన్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మాస్త్రం మూవీలో తనకు ఒక పాత్రకు అవకాశం వచ్చింది అని , బిజీ షెడ్యూల్ కారణంగా ఆ మూవీ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లుగా సుధీర్ బాబు తాజా ఇంటర్వ్యూ లో చెప్పు కొచ్చాడు.  

ఇది ఇలా ఉంటే బ్రహ్మాస్త్రం మూవీ ఇప్పటికే సెప్టెంబర్ 9 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకొని ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్ లను రాబడుతుంది. ఈ మూవీ లో అమితా బచ్చన్ ,  నాగార్జున ,  మౌని రాయ్ ముఖ్య పాత్రలో నటించారు. బ్రహ్మాస్త్రం మూవీ తెలుగులో కూడా విడుదల అయ్యింది. తెలుగు లో ఈ మూవీ ని దర్శక ధీరుడు రాజమౌళి సమర్పించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: