దర్శకుడి గా , నటుడి గా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ తమిళ మరియు తెలుగు ఇండస్ట్రీ లో ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా ఎన్నో మూవీ లలో నటించి తన నటన తో కూడా ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రేమ కథ లను వెండి తెర పై ఎంత అద్భుతంగా తెరకెక్కిస్తాడో ,  యాక్షన్ మూవీ లను కూడా అదే రేంజ్ లో వెండి తెరపై తెరకెక్కించడం ఈ దర్శకుడి ప్రత్యేకత. ఇది ఇలా ఉంటే గౌతమ్ వాసుదేవ్ మీనన్ కెరియర్ లో మంచి విజయాలు సాధించిన మూవీ లలో 'వేట్టైయాడు విళయాడు' మూవీ ఒకటి.

మూవీ లో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించాడు. ఈ మూవీ ని తెలుగు లో రాఘవన్ అనే పేరు తో విడుదల చేశారు. ఈ మూవీ అటు తమిళ్ ఇటు తెలుగు లో రెండింటి లోనూ మంచి విజయాన్ని సాధించింది. ఇది ఇలా ఉంటే తాజాగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ , శింబు హీరోగా ది లైఫ్ ఆఫ్ ముత్తు అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ కొంత కాలం క్రితమే విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ విజయ వంతంగా థియేటర్ లలో ప్రదర్శించ బడుతుంది. ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో గౌతమ్ వాసుదేవ్ మాట్లాడుతూ ... చిరంజీవి గారితో 'వేట్టైయాడు విళయాడు' లాంటి తరహా మూవీ చేయాలని ఉంది అని తాజాగా చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: