ఒకప్పటి హీరోయిన్ ప్రస్తుత క్యారెక్టర్ ఆర్టిస్టు ఆమని గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. కేవలం తెలుగు భాష ప్రేక్షకులకు మాత్రమే కాదు తమిళం కన్నడ భాషల్లో కూడా నటించి అక్కడ కూడా అభిమానులను సంపాదించుకుని సుపరిచితురాలిగా  మారిపోయింది ఆమని.  ఒకప్పుడు వరుస సినిమాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగింది అని చెప్పాలి. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడిపంబ అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా ఎంత బ్లాక్బస్టర్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 ఆ తర్వాత 1993లో బాపు దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ పెళ్ళాం లో నటించి ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా దక్కించుకుంది. ఆ తర్వాత శుభలగ్నం సినిమాతో  ప్రతి ఇంట్లో మనిషిగా గుర్తింపు సంపాదించుకుంది ఈ హీరోయిన్. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ఆమె ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణం ఏమిటి అన్నది ఇప్పటికీ ఒక ప్రశ్న.  ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది ఆమని. తాను కెరీర్లో బిజీగా ఉన్న సమయంలో పెళ్లి వద్దు అని ఎంతమంది చెప్పినా వినకుండా పెళ్లి చేసుకున్నాను. కొంతకాలం ఆగిన తర్వాత పెళ్లి చేసుకొని ఉంటే బాగుండేది.


 పెళ్లి తర్వాత భర్త పిల్లల బాధ్యత చూసుకోవాల్సి వచ్చింది. తద్వారా ఇక ఇంటి బాధ్యతలు కోసం సినిమాలను పక్కన పెట్టాల్సి వచ్చింది అంటూ ఆమని చెప్పుకొచ్చింది. సినిమాల్లోకి రావడానికి తన తల్లి ఎంతో ప్రోత్సహించింది అంటూ చెప్పుకొచ్చింది. తన తల్లి ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కారణంగానే తాను సినిమాల్లో హీరోయిన్గా నిలదొక్కుకోగలిగాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి తర్వాత ఒంటరిగా  ఇంట్లో ఉండడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. మళ్ళీ తన భర్త  సినిమాల్లో నటించమని చెప్పడంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాను అంటూ తెలిపింది. ఇప్పుడు సినిమాల్లోనే కాదు బుల్లితెరపై జడ్జిగా కూడా అవతారమెత్తింది ఆమనీ.

మరింత సమాచారం తెలుసుకోండి: