కొన్ని కొన్ని సందర్భాలలో ఒకే రోజు మంచి క్రేజ్ ఉన్న రెండు ,  మూడు సినిమాలు థియేటర్ లలో విడుదల అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్  టాక్ ను తెచ్చుకొని మంచి వసూలను కలెక్ట్ చేస్తే , మరి కొన్ని సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సా ఫీస్ దగ్గర బోల్తా పడుతూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం అక్టోబర్ 5 వ తేదీన కూడా మంచి క్రేజ్ ఉన్న మూడు సినిమాలు విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి.

ఆ సినిమాలు ఏమిటో తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ ,  సత్య దేవ్ ,  నయన తార కీలక పాత్రలలో నటించగా తమన్మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా తెరకెక్కిన ది ఘోస్ట్ మూవీ ని కూడా అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ కి యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా మంచు విష్ణు జిన్నా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీబిలో సన్నీ లియోన్ ,  పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ లుగా నటించగా సూర్యమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని కూడా అక్టోబర్ 5 వ తేదీనే విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: